Telangana: నేడే ఇంటర్ ఫలితాలు

Telangana: నేడే ఇంటర్ ఫలితాలు
ఉదయం 11 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయనున్నారు

ఇవాళ తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. అంతకముందు ఇంటర్ బోర్డు అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షించారు. ఇంటర్ విద్యార్థులు తమ పరీక్షా ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్‌ tsbie.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చని బోర్డు అధికారులు తెలిపారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులు థియరీ, ప్రాక్టికల్ రెండింటిలోనూ కనీసం 35 శాతం మార్కులు సాధించాల్సి ఉందన్నారు.

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 4,82,501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4,23, 901 మంది హాజరయ్యారు. దాదాపు 9.06 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యంకన ప్రక్రియ ఏప్రిల్‌ రెండో వారంలోనే పూర్తయింది. పలు దఫాలుగా ట్రయల్‌రన్‌ చేసిన అనంతరం సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండటంతో జీరో సాంకేతిక సమస్యలు నిర్ధారౖణెందని.. దీంతో ఫలితాల వెల్లడికి ఎలాంటి ఆటంకాల్లేవని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం ఫలితాలను వెలువరించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story