Telangana: ఠారెత్తుతున్న ఎండలు..ఉక్కిరిబిక్కిరైతున్న ప్రజలు

Telangana: ఠారెత్తుతున్న ఎండలు..ఉక్కిరిబిక్కిరైతున్న ప్రజలు
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ప్రచంఢ భానుడు మరింత చెలరేగే అవకాశం

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ప్రచంఢ భానుడు మరింత చెలరేగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. క్రమంగా ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తుండడంతో.. ప్రజలు బెంబేలెత్తిపోతున్నాయి. ఈ వేసవి గడిచేదెలా అని మథనపడుతున్నారు. జోగులాంబ, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, యాదాద్రి భువనగిరి, జనగామ, సిద్ధిపేట, మెదక్‌, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నారాయణ్‌పేట్‌లో 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అటు.. ఈనెల 13 నుంచి 17తేదీల మధ్య కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటే అవకాశముందన్న వార్తలు బెంబేలెత్తిస్తున్నాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌, కరీంనగర్‌, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కొమరంభీమ్‌, జిగిత్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతాయట. ఈ జిల్లాల్లో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story