Telangana: 2వేల మంది విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ

Telangana: 2వేల మంది విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ
ఒక్కో ట్యాబ్ విలువ 86వేలు ఉంటుందన్న ఆయన..విద్యార్థులకు పోటీ పరీక్షల సమయంలో దీని ఉపయోగం ఎంతగానో ఉంటుందన్నారు

విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్‌. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్రంలోని 26వేల పాఠశాలలను అభివృద్ది చేస్తామని ఆయన తెలిపారు. రాజన్న సరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2వేల మంది విద్యార్థులకు మంత్రి కేటీఆర్ ట్యాబ్‭లను పంపిణీ చేశారు. ఒక్కో ట్యాబ్ విలువ 86వేలు ఉంటుందన్న ఆయన..విద్యార్థులకు పోటీ పరీక్షల సమయంలో దీని ఉపయోగం ఎంతగానో ఉంటుందన్నారు. ఎల్లారెడ్డిపేటను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలోని పాఠశాలలను రాష్ట్రంలో భిన్నంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. దేశంలోనే సిరిసిల్ల జిల్లాకు స్వచ్ఛ్ సర్వేక్షణ్ లో గ్రామీణ అవార్డు వచ్చిందని చెప్పారు. ఇక వేములవాడ నియోజకవర్గంలో కూడా 3 వేల ట్యాబ్‭లు అందజేస్తామని కేటీఆర్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story