Telangana: ఇకపై 24గంటలూ షాపింగ్‌ చేసుకోవచ్చు

Telangana: ఇకపై 24గంటలూ షాపింగ్‌ చేసుకోవచ్చు

తెలంగాణలో వ్యాపారులకు గుడ్ న్యూస్. ఇకపై ట్వంటీ ఫోర్ ఇన్టూ సెవెన్‌ షాపులు తెరిచి వ్యాపారం చేసుకోవచ్చు. తెలంగాణ షాప్స్‌ అండ్‌ ఇస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌ 1988కు ప్రభుత్వం సవరణ చేసింది. దీంతో రాష్ట్రంలో ఇకపై 24 గంటల పాటు షాపులు తెరిచి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించింది. అదనంగా పది వేల రూపాయలు చెల్లిస్తే చాలు.. ఏ వ్యాపారమైనా 24 గంటలు చేసుకునేలా అనుమతించింది. తెలంగాణ షాప్స్‌ అండ్‌ ఇస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌ 1988కు సవరణ చేయడంపై వ్యాపారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చర్యతో వ్యాపారం మరింత పుంజుకునే అవకాశం ఉందని వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story