Telangana : 2.90 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌

Telangana : 2.90 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌
రెవెన్యూ వ్యయం 2వేల 11వందల కోట్లుగా పేర్కొన్నారు. మూల ధన వ్యయం 37వేల 525కోట్లని వెల్లడించారు.

2.90లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి హరీష్‌ రావు. రెవెన్యూ వ్యయం 2వేల 11వందల కోట్లుగా పేర్కొన్నారు. మూల ధన వ్యయం 37వేల 525కోట్లని వెల్లడించారు. ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు.

బీఆర్ఎస్‌ సర్కార్‌ ప్రజల ముందుకు పక్కా ఎన్నికల బడ్జెట్‌ తీసుకువచ్చింది. 2 లక్షల 90 వేల 396 కోట్లతో బాహుబలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కీలక శాఖలకు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచింది. ప్రధానంగా దళిత బంధు, రైతు బంధు, ఆసర పెన్షన్లు, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి.. భారీగా కేటాయింపులు చేసింది. ఆసరా పెన్షన్లకు 12 వేల కోట్లు.. రైతు బంధుకు 15 వేల 75 కోట్లు.. దళిత బంధుకు 17 వేల 700 కోట్లు ఇచ్చింది. ఈసారి స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్స్‌ భారీగా పెంచింది. గత ఏడాది స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్స్‌ కోసం 2 వేల కోట్లు ఇస్తే.. ఈసారి 10 వేల 340 కోట్లు కేటాయించింది. రుణమాఫీ కోసం గత ఏడాది 4 వేలు కోట్లు ఇస్తే.. ఇప్పుడు 6 వేల 700 కోట్లు కేటాయించింది. ఐతే.. నిరుద్యోగ భృతి, గిరిజన బంధు, ఖాళీ జాగా ఉంటే ఇళ్లు నిర్మించుకునేందుకు 3 లక్షల సాయం అందిస్తామన్న అంశాలపై ఈ బడ్జెట్‌లో ప్రస్తావన లేదు.

వ్యవసాయ రంగానికి 26వేల 831కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు హరీష్ రావు. సుసంపన్నమైన వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ నేడు దేశానికి దిశా నిర్దేశం చేస్తోందన్నారు. తెలంగాణ ఆవిర్భవించినప్పటి ఇప్పటివరకు వ్యవసాయ రంగానికి లక్షా 91వేల 612 కోట్లు కేటాయించా మన్నారు. రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నట్లు గుర్తుచేశారు.

నీటి పారుదల శాఖకు 26వేల 885కోట్లను కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. 3వేల 825కోట్లతో వేయి 200 చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టామన్నారు హరీష్ రావు. వీటిలో మొదటి దశ 650 చెక్‌ డ్యాంల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 60శాతం పూర్తయ్యిందని గుర్తుచేశారు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.

Tags

Read MoreRead Less
Next Story