Telangana Budget: తెలంగాణ తొలిపద్దు, ఆరు గ్యారంటీలకే ప్రాధాన్యం

Telangana Budget:  తెలంగాణ తొలిపద్దు, ఆరు గ్యారంటీలకే ప్రాధాన్యం
2లక్షల75వేల 891 కోట్లతో బడ్జెట్..

2024-25 సంవత్సరానికి తెలంగాణ ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క 2,75,891 కోట్లతో

మధ్యంతర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 1,38,228 కోట్లు పన్నుల రూపంలో వస్తాయని, సీజీఎస్టీ ద్వారా 7838 కోట్లు, ఎస్జీఎస్టీ ద్వారా 50 వేల 762 కోట్లు..... వస్తాయని ప్రతిపాదించారు. కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటాగా ఈ ఏడాది 25,639 కోట్లు వస్తాయని పేర్కొన్నారు. పన్నేతర ఆదాయాన్ని 20 వేల 658 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. రానున్న సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 21,075 కోట్లు వస్తాయని బడ్జెట్ లో పేర్కొన్నారు. ఈ గ్రాంట్లలో ఆర్థికసంఘం నిధులతో పాటు... జాతీయ ఆరోగ్య పథకం నుంచి వచ్చే నిధులు సహా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నిధులు ఉన్నాయి. రాష్ట్ర వాటా జమ చేయకపోవడంతో గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నుంచి వచ్చే నిధులు తక్కువగా వస్తున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు...స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన రాష్ట్ర వాటా చెల్లించి వీలైనంత ఎక్కువగా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు గ్రాంట్ల మొత్తాన్ని ఎక్కువగా ప్రతిపాదించారు. 2024-25లో ఎఫ్ఆర్బీఎంకు లోబడి 59,625 కోట్ల అప్పులు తీసుకునేందుకు..... ప్రభుత్వం ప్రతిపాదించింది. మూలధన వ్యయాన్ని 29 వేల కోట్లుగా ప్రతిపాదించారు.

ఆరు గ్యారెంటీల అమలుకు..తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చింది.2,75,891 కోట్ల పద్దులో గ్యారంటీలకు.. తాత్కాలికంగా 53 వేల 196 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. మరో రెండు హామీల అమలుకు.... ఇప్పటికే ఆమోదం తెలిపినట్లు వివరించింది. త్వరలోనే తగిన విధివిధానాలు రూపకల్పన చేసి వాటి ఫలాలను... ప్రజలకు అందిస్తామని పేర్కొంది. గ్యారంటీల అమలుకు 53 వేల 196 కోట్లు ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే కేటాయించినట్లు తెలిపింది. విధివిధానాల రూపకల్పన పూర్తైన వెంటనే..అవసరమైన పూర్తి నిధులు కేటాయించనున్నట్లు వివరించింది. ప్రాథమిక కేటాయింపుల మేరకు..రైతు భరోసా పథకానికి 15 వేల కోట్లు కేటాయించారు. చేయూత పథకం కింద పింఛన్ల కోసం14 వేల 800 కోట్లు ప్రతిపాదించారు. ఇందిరమ్మ ఇండ్లకు 7వేల 740 కోట్ల రూపాయలు కేటాయించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సాయం కోసం 7230 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఆర్టీసీ బస్సులో మహిళలఉచిత ప్రయాణం కోసం 4084 కోట్లు కేటాయించారు. గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం 2వేల418 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 1065 కోట్లు కేటాయించారు.500రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు బడ్జెట్‌లో 723 కోట్ల రూపాయాలు ప్రాథమికంగా కేటాయించారు.

Tags

Read MoreRead Less
Next Story