Telangana Assembly Election 2023 : ఏడు గంటలకే పోలింగ్ షురూ ..

Telangana Assembly Election 2023 : ఏడు గంటలకే పోలింగ్ షురూ ..
ఓటుహక్కు వినియోగించుకున్న రాజకీయ నేతలు

తెలంగాణలో ఓట్ల పండుగ మొదలైంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. దీంట్లో భాగంగా..ఖమ్మం జిల్లా నారాయణపురంలో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓటు వేశారు. పరకాలలో బీఆర్ఎస్ అభ్యర్ధి చల్లా ధర్మారెడ్డి,నిర్మల్ జిల్లా ఎల్లపల్లిలో ఇంద్రకరణ్ రెడ్డి,ఖమ్మం గొల్లగూడెంలో తుమ్మల నాగేశ్వరరావు వంటి పలువురు రాజకీయ నేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అలాగే..కుటుంబ సమేతంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ వాసవి కాలేజీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలోని పోలింగ్ స్టేషన్ 89లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్ జిల్లాలో పర్వతగిరి జెడ్పీఎస్ఎస్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ఓటేయాలని కవిత పిలుపునిచ్చారు.

నల్గొండ జిల్లా..మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలోని 102 పోలింగ్ కేంద్రంలో టిఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. అంబర్ పేటలో డీజీపీ అంజనీకుమార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాచీగూడలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఓటు వేశాను. ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు తమ ఓటు వినియోగించుకున్నారు. కామారెడ్డి జిల్లా స్వగ్రామం పోచారం గ్రామంలో సతీమణి పుష్పతో కలిసి రాష్ట్ర శాసన సభాపతి, బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస రెడ్డి తన ఓటు వేశారు. యాఖత్ పురా బీఆర్ఎస్ అభ్యర్థి సామ సుందర్ రెడ్డి దంపతులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ దంపతులు ఓటు వేశారు. ఎల్‌బీ నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తన కుటుంభ సభ్యులతో కలిసి బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ పరిధిలోని మారుతి నగర్‌లోని ఎస్.ఎస్.ఎస్.విద్యా నికేతన్ స్కూల్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story