అసెంబ్లీ సమావేశాలు.. నాలుగు బిల్లులు తీసుకురావాలని సిద్ధమైన ప్రభుత్వం

అసెంబ్లీ సమావేశాలు.. నాలుగు బిల్లులు తీసుకురావాలని సిద్ధమైన ప్రభుత్వం

సోమవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో నిబంధనలు, ఆంక్షల నడుమ ఈ సమావేశాలు జరగబోతున్నాయి. శాసనసభ, శాసనమండలిలో సుదీర్ఘ చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా వ్యాధి వ్యాప్తి .. ప్రభుత్వం తీసుకున్న చర్యలు... ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు... దేశవ్యాప్తంగా ఉన్న కరోనా పరిస్థితి .. తదితర అంశాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరపాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తున్న తరుణంలో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ పనితీరు వివరించాలని సర్కారు భావిస్తోంది. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు సమాధానం చెప్తూనే.. కరోనా విషయంలో అసెంబ్లీలో సర్కారు ప్రోగ్రెస్‌ను వివరించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.

ఇక శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో జరిగినటువంటి ప్రమాదంపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం వివరణ ఇవ్వనుందని సమాచారం. ఘటనపై శాఖాపరమైన విచారణతోపాటు ప్రభుత్వం సీఐడీ విచారణ కూడా జరిపిస్తోంది. అయితే ప్రమాదంపై ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్న తరుణంలో ప్రభుత్వం రిప్లై ఇవ్వనుంది. ప్రమాదంలో మరణించినటువంటి తొమ్మిది మంది ఉద్యోగులకు నష్టపరిహారం ఇవ్వడంతోపాటు ఆ తర్వాత తీసుకున్నటువంటి చర్యలపై ప్రతిపక్షాలకు వివరణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ సమావేశాల్లో నాలుగు బిల్లులు తేవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో జరుగుతున్నటువంటి అవకతవకలను అరికట్టేందుకు కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ప్రక్రియను పూర్తి చేశారు. గడచిన ఆరు నెలలుగా సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టంపై పూర్తిస్థాయి కసరత్తు చేశారు. ఈ సమావేశాల్లో కొత్త రెవెన్యూ విధానంపై బిల్లు పెట్టనుంది. నూతన పాలసీ స్వరూపం ఏవిధంగా ఉండబోతోందో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం వివరించనుంది. కొత్త రెవెన్యూ పాలసీతో ఎలాంటి సంస్కరణలు రాబోతున్నాయో... అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు వివరించడానికి ప్రభుత్వం రెడీ అయింది.

ఈ సమావేశాల వేదికగా జీఎస్టీ విషయంలో కేంద్రం అవలంబిస్తున్న తీరును ఎండగట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసలే కరోనాతో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఆదుకోవాల్సిన కేంద్రం తెలంగాణకు రావలసిన నిధులను ఇవ్వకుండా మోసం చేస్తోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ విషయంలో ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ కూడా రాశారు. తెలంగాణ జీఎస్టీ నిధులను వెంటనే విడుదల చేయాలని కూడా కేంద్రాన్ని కోరారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన నాటినుంచి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. జీఎస్టీ అమలు తీరు.. కేంద్రానికి ఉన్నటువంటి రాష్ట్ర వాటా... కేంద్రం నుంచి తెలంగాణకు వస్తున్న నిధులపై అసెంబ్లీలో ప్రభుత్వం వివరించనుంది.

అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సంతాప తీర్మానాలు చేయనున్నారు. ఇటీవల చనిపోయిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి సంతాపం ప్రకటించనున్నారు. ఇక పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రాంత పీవీ నరసింహారావు దేశ ప్రధానిగా అనేక సంస్కరణలు తీసుకు వచ్చి సేవలందించారు. అందుకోసం పీవీ నరసింహారావుకు సముచిత గౌరవం ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story