Telangana Bathukamma : తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ షురూ..

Telangana Bathukamma : తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ షురూ..
Telangana Bathukamma : తెలంగాణలో బతుకమ్మ చీరలు పంపిణీ షురు అయ్యింది. ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ వేడుకలకు ముందుగానే చీరలను పంపిణీ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం

Telangana Bathukamma : తెలంగాణలో బతుకమ్మ చీరలు పంపిణీ షురు అయ్యింది. ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ వేడుకలకు ముందుగానే చీరలను పంపిణీ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఆడపడుచులకు మంత్రి కేటీఆర్ చీరలను అందజేశారు.

నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రాలో తెల్ల రేషన్‌ కార్డు లబ్ధిదారులై, 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు బతుకమ్మ చీరను అందించనున్నారు. 24 విభిన్న డిజైన్లు, 10 రకాల ఆకర్షణీయమైన రంగుల్లో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్తో చీరలు రూపొందించారు. బతుకమ్మ చీరల ప్రాజెక్ట్ కోసం రూ.339.73 కోట్లు ఖర్చు చేశామమన్నారు మంత్రి కేటీఆర్.. బతుకమ్మ చీరల ప్రాజెక్ట్తో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపామని కేటీఆర్ తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి చీరలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కోటి చీరల్లో 90 లక్షల చీరలు 6.3 మీటర్ల పొడవుతో రెగ్యులర్ చీరలు, మరో 10 లక్షల చీరలు 9 మీటర్లతో వృద్ధుల కోసం ప్రత్యేకించి తయారు చేయించారు. 15 వేల మరమగ్గాల్లో ఈ చీరలను కార్మికులు నేశారు. మొత్తం 30 వేల మంది కార్మికులు బతుకమ్మ చీరల కోసం శ్రమించారు. GHMC పరిధిలో మొత్తం 30 సర్కిళ్ల తో పాటు కంటోన్మెంట్ ఏరియాలో కూడా బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. GHMCలో మొత్తం 15 లక్షల 85 వేల 405 చీరలు అవసరం ఉంటాయని అధికారులు అంచనా వేశారు.

Tags

Read MoreRead Less
Next Story