Telangana - BJP : భాజాపాకు కొత్త బాస్ వచ్చేనా??

Telangana
Telangana - BJP : భాజాపాకు కొత్త బాస్ వచ్చేనా??
బీజేపీ కొత్త సారధి రాకపై ఊహాగానాలు; బండినే కొనసాగిస్తారా!? ఈటేల వైపు మొగ్గు చూపుతారా!? అక్కడ నడ్డా..ఇక్కడ బండి మారరు అంటున్న తరుణ్ చుగ్





మార్చి పదకొండు 2023 నాటికి బీజేపీ అధ్యక్షునిగా బండి సంజయ్ మూడేళ్లు పూర్తి చేసుకుంటున్నారు. దీంతో బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారా లేదా బండినే ఎన్నికలవరకు కొనసాగిస్తారా? అనే చర్చ ఊపందుకోంది. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటేల రాజేందర్ ఎన్నికల ముందు బీజేపీ ఛీఫ్ గా నియమించి బండిని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ఉహాగానాలు వినిపిస్తున్నాయి.


అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఎన్నికల వరకు కొనసాగుతారనే సంకేతాలని జాతీయన్యాయకత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. 2024 ఎన్నికల వరకు నడ్డా కొనసాగనున్న నేపథ్యంలో రాష్ట్రాల అధ్యక్షులను సైతం కొనసాగిస్తారా.. కొత్త వారిని నియమిస్తారా అన్నది తెలంగాణలో హాట్ టాపిక్ గామారింది. 2014 లో ఐదు సీట్లు ,2018 లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ .. బండిరాకతో ఏకంగా బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగింది. దుబ్బాక ,హూజూరాబాద్ , జీహెచ్ ఎంసీల్లో సత్తా చాటడంతో బండి పేరు మారు మోగింది.



ఒకరకంగా బీజేపీలో బండి ముందు, బండి తర్వాత అన్న విధంగా తయారైంది.. జాతీయ న్యాయకత్వం సైతం పూర్తి అండదండలు అందించడంతో దూకుడుతో ముందుకెళ్తున్నారు. ప్రజాసంగ్రామ యాత్ర తో ఇప్పటికే తెలంగాణలో మెజార్టీ నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేశారు.. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై ఎదురుదాడి చేయడంలో బండిసంజయ్ అందరి నేతలకన్నా ముందువరుసలో ఉన్నారు.


ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలో సతమతమవుతోంది. దేశవ్యాప్తంగా ఆ పార్టీ గ్రాఫ్ నానాటికి పడిపోతోంది. రాహూల్ జోడో యాత్ర ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియని స్ధితిలో కాంగ్రెస్ ఉంది. దక్షిణాదిలో కర్నాటక తర్వాత తెలంగాణలో బీజేపీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బలంగా నమ్ముతున్న బీజేపీ అగ్రన్యాయకత్వం బండి పేనే భరోసా కనబరుస్తోందంటున్నారు..


టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఈటేల రాజేందర్ సైతం పోటిలో ఉన్నారు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి కీలక నేతలను బీజేపీలోకి తీసుకువచ్చే బాధ్యతను ఈటేలకు అప్పగించారు.. మునుగోడులో కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమితో..ఒక రకంగా బీజేపీవైపు చూసే నేతలు సైతం ఆపార్టీలోకి వెళ్లాల వద్దా అనే మీమాంసలో ఉన్నారు. అయితే తనకు అధ్యక్ష పదవి ఇచ్చి.. బీసీ సీఎం అభ్యర్దిగా ప్రొజెక్టు చేస్తే.. బీఆర్ఎస్ ను ఓడీంచడం ఖాయమని బీజేపీలో ఈటేల వర్గీయులు అంటున్నారు..


అయితే బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మాత్రం బీజేపీ ఆధ్యక్ష పదవి .. చేరికల కమిటి అద్యక్ష పదవి రెండు ఒకటేనని అంటున్నారు.. అక్కడ నడ్డా...ఇక్కడ బండి ఎన్నికల వరకు కొనసాగుతారని స్పష్టం చేస్తున్నారు.. కాబట్టి ఈటేల బండి పోటీలో ఎవరు గెలుస్తారు అన్నది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story