TS BJP: బీజేపీ తొలి జాబితా ఇదేనా!

TS BJP: బీజేపీ తొలి జాబితా ఇదేనా!
40 మంది జాబితాను ఢిల్లీకి పంపిన రాష్ట్ర నాయకత్వం.... 15 లేదా 16 తేదీల్లో ప్రకటన

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థుల ఎంపికపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఏకాభిప్రాయం కుదిరిన 40 మంది జాబితాను రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఢిల్లీలోనే అధిష్ఠానానికి పంపించింది. సిట్టింగ్‌ M.Pలు అంతా MLAలుగా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మూడు విడతల్లో 119 మంది అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఈనెల 15లేదా 16న 38 మందితో తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు భారతీయ జనతా పార్టీ వర్గాలు వెల్లడించాయి. అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ వస్తుందన్న ప్రచారంతో బీజేపీ అప్రమత్తమైంది. ఎన్నికల్లో పోటీకి ఆశావహుల నుంచి 6వేలకుపైగా దరఖాస్తులు అందాయి. కొంతమంది మంది మూడు, నాలుగు స్థానాలకు అర్జీ పెట్టుకున్నారు. తెలంగాణ నాయకత్వం 40మందితో జాతీయ నాయకత్వం జాబితా పంపించింది. చిన్నపాటి మార్పులు, చేర్పుల అనంతరం బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నారు.


తొలి జాబితాలో ఈ పేర్లు ఉన్నట్లు సమాచారం

అంబర్ పేట- కిషన్‌రెడ్డి

ముషీరాబాద్-బండారు విజయలక్ష్మి

సనత్‌నగర్‌ -మర్రి శశిధర్‌రెడ్డి

ఉప్పల్- ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

మల్కాజిగిరి-రాంచందర్ రావు

ఖైరతాబాద్-చింతల రామచంద్రారెడ్డి

గోషామహాల్-విక్రమ్ గౌడ్

మహేశ్వరం-అందెల శ్రీరాములు యాదవ్‌

కల్వకుర్తి - తల్లోజు అచారి

గద్వాల-డీకే అరుణ

మహబూబ్‌నగర్‌ - జితేందర్‌రెడ్డి

తాండూరు-కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ఇబ్రహీంపట్నం-బూర నర్సయ్య గౌడ్

కుత్భుల్లాపూర్‌- కూన శ్రీశైలం గౌడ్

భువనగిరి-గూడూరు నారాయణ రెడ్డి

ఆలేరు-కాసం వెంకటేశ్వర్లు

హుజురాబాద్-ఈటల రాజేందర్

కరీంనగర్-బండి సంజయ్

చొప్పదండి-బొడిగే శోభ

వరంగల్ తూర్పు-ఎర్రబెల్లి ప్రదీప్‌రావు

భూపాలపల్లి-చందుపట్ల కీర్తిరెడ్డి

వేములవాడ- చెన్నమనేని వికాస్‌ రావు

ఆదిలాబాద్‌-పాయల్‌ శంకర్‌

బోధ్-సోయం బాపూరావు

ఆర్మూర్ -ధర్మపురి అరవింద్

మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సూర్యాపేట-సంకినేని వెంకటేశ్వర్లు

పరకాల -గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి

దుబ్బాక-రఘునందన్ రావు

వర్ధన్నపేట- కొండేటి శ్రీధర్‌

మహబూబాబాద్‌- హుస్సేన్ నాయక్

సికింద్రాబాద్-బండా కార్తీక రెడ్డి

నర్సంపేట-రేవూరి ప్రకాశ్ రెడ్డి

నిర్మల్-మహేశ్వర్ రెడ్డి

వరంగల్‌ పశ్చిమ-ఏనుగుల రాకేష్‌ రెడ్డి

స్టేషన్‌ ఘనపూర్‌-విజయరామారావు

రాజేంద్రనగర్‌-తోకల శ్రీనివాస్‌ రెడ్డి

Tags

Read MoreRead Less
Next Story