BJP: నేడు బీజేపీ ఆభ్యర్థుల నామినేషన్లు

BJP: నేడు బీజేపీ ఆభ్యర్థుల నామినేషన్లు
హాజరుకానున్న కేంద్ర మంత్రులు.... కేసీఆర్‌ పాలనపై ప్రజలు విసిగిపోయారన్న కిషన్‌రెడ్డి

తెలంగాణ ఆర్థిక మూలాలను కేసీఆర్ ధ్వంసం చేశారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మీడియా సెంటర్‌లో పార్టీ అభ్యర్థులకు బీ-ఫాంలు అందిచిన ఆయన కేసీఆర్ మాటలు కోటలుదాటుతాయి తప్పితే.. ప్రగతి భవన్ గోడలు దాటవన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. దీపావళి తర్వాత బీజేపీ ప్రచారంలో మరింత వేగం ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీసిని ముఖ్యమంత్రిని చేయడమే ఓ యజ్ఞంగా ముందుకు వెళ్తున్నట్లు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం అక్రమ సంపాదన నియంతృత్వ ధోరణితో ప్రజలు విసిగిపోయారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ గ్యారెంటీలు నమ్మే పరిస్థితి లేదన్న కిషన్‌రెడ్డి, IT దాడులకు బీజేపీకి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. నేడు బీజేపీ అభ్యర్థులు పలు నియోజకవర్గాల్లో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనుండగా వారికి మద్దతుగా కేంద్రమంత్రులు, జాతీయనేతలు పాల్గొననున్నారు.


గ్యారంటీల పేరిట కర్ణాటక ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ ముంచిందని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఏ మాత్రం పుంజుకున్న రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుందని విమర్శించారు. కేసీఅర్ మరొసారి అధికారంలోకి వచ్చినా హస్తం పార్టీ పగ్గాలు చేపట్టినా తెలంగాణ అంధకారం అవుతుందని తెలిపారు. కాంగ్రెస్‌ నేతలపై ఐటీ, ఈడీ తనిఖీలతో తనకేం సంబంధమని కిషన్‌రెడ్డి వివరణ ఇచ్చారు. నేడు బీజేపీ అభ్యర్థులు పలు నియోజకవర్గాలలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. పలు చోట్ల అభ్యర్థులకు మద్దతుగా కేంద్రమంత్రులు, జాతీయ నేతలు పాల్గొని ప్రచారాలు నిర్వహించనున్నారు. మునుగోడు, పాలకుర్తిలో అనురాగ్ ఠాకూర్ కొల్లాపూర్, నాగర్‌కర్నూల్‌లో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల ప్రచారం చేస్తారని పార్టీ అధికార ప్రతినిధి సుభాష్‌ తెలిపారు. వరంగల్ తూర్పు, పశ్చిమ అసెంబ్లీ స్థానాల పరిధిలో అశ్వినికుమార్ చౌబే ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. రేపు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారని పునరుద్ఘాటించారు. ఈ నెల 27 వరకు జరిగే ఎన్నికల ప్రచారంలో ప్రధానితో పాటు, జాతీయ నేతలు పాల్గొంటారని సుభాష్‌ తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్న నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. నేతలు అందరూ ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లేలా ప్రచార వ్యూహం ఖరారు చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story