BJP: బీజేపీ మేనిఫేస్టో... సకల జనుల సౌభాగ్య

BJP: బీజేపీ మేనిఫేస్టో... సకల జనుల సౌభాగ్య
తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ... పది అంశాలతో మేనిఫెస్టో విడదల చేసిన అమిత్‌ షా

భారతీయ జనతా పార్టీ సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది. తెలంగాణను ప్రగతి పథంలో నడిపేందుకు పది అంశాలతో మేనిఫెస్టోను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా విడుదల చేశారు. సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌, సబ్‌ కా ప్రయాస్‌ నినాదంతో సుపరిపాలన అందిస్తామని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తగ్గించినట్టే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గిస్తామని పేర్కొన్నారు. ధరణి స్థానంలో మీ భూమి వ్యవస్థను తీసుకొస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు నోడల్ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక నోడల్ విభాగం ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగస్తులు, పింఛనర్లకు ప్రతినెల 1నే వేతనాలు, పింఛన్లు ఇస్తామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కుంభకోణాలపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. మత ప్రతిపాదికన ఇచ్చిన రిజర్వేషన్లను తొలగించి, బీసీ, ఎస్సీలు, ఎస్టీలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఎస్సీ ఉప వర్గీకరణను వేగవంతం చేయడంలో సహకారం అందిస్తామన్నారు.


తెలంగాణ అవసరాలకు తగ్గట్లుగా కొత్త ఇళ్ల నిర్మాణం, తద్వారా అందరికీ ఇళ్లు ఉండేలా చూస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు అందజేస్తామన్నారు. అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, సమయానుకూలంగా కొత్త కార్డులు ఇస్తుంటామని హామీ ఇచ్చారు. ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు కోసం చిన్న, సన్నకారు రైతులకు 2వేల 500 ఇన్‌పుట్‌ సహాయం అందిస్తామన్నారు.పీఎం ఫసల్‌ బీమా యోజన కింద రైతులకు ఉచితంగా పంటల బీమా కల్పిస్తామనిపేర్కొన్నారు. వరికి 3 వేల100 మద్దతు ధర కల్పిస్తామని, పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆసక్తి గల రైతులకు ఉచితంగా దేశీ ఆవులు పంపిణీ చేస్తామన్నారు. నిజామాబాద్‌ను టర్మరిక్ సిటీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సు విద్యార్థినులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఆడబిడ్డ భరోసా పేరుతో నవజాత బాలికపై ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేస్తామని, బాలికకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత, 2 లక్షల రూపాయలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు 1 శాతం వడ్డీకే రుణాలు ఇస్తామని, మహిళా రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story