Telangana BJP : స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో పోటీకి బీజేపీ దూరం

Telangana BJP : స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో పోటీకి బీజేపీ దూరం
Telangana BJP : స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది బీజేపీ. రాష్ట్రంలో ప్రస్తుతం 12 MLC స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నయి.

Telangana BJP : స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది బీజేపీ. రాష్ట్రంలో ప్రస్తుతం 12 MLC స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నయి. TRS అభ్యర్థులను ప్రకటించి నామినేషన్లు కూడా వేయిస్తోంది. కానీ కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బీజేపీ తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ఇప్పటికే ప్రకటించింది.

రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా బరిలో దిగాలని గతంలో నిర్ణయించింది బీజేపీ నాయకత్వం. అన్నట్టుగానే ఇప్పటివరకూ ఏ ఎన్నికను వదిలిపెట్టకుండా పోటీకి దిగింది బీజేపీ. ఏ ఎన్నికను ఈజీగా తీసుకోకుండా పోరాటం చేస్తోంది. దుబ్బాక, GHMC, హుజురాబాద్‌ ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్‌ కూడా ఇచ్చింది. మరోవైపు రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై గట్టిగా పోరాడుతూ..TRSకు తామే ప్రత్యామ్నాయం అన్న భావన ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు బీజేపీ నేతలు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటి చేయాలని కార్యకర్తల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీలో చర్చించామని..స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు నేతలు చెప్తున్నారు.

బలాబలాలు చూసుకొకుండా ఎన్నికలకు వెళ్తే ఇబ్బందులు తలెత్తుతాయని నాయకులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. హుజురాబాద్‌ ఉప ఎన్నికలో భారీ విజయం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఆదరణ వచ్చిందని...ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే తప్పుడు సంకేతాలు పోతాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

బరిలో దిగితే ఖర్చు కూడా భారీగా ఉంటుందని...పార్టీకి తలకు మించిన భారంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి,నిజామాబాద్,కరీంనగర్‌ జిల్లాల్లో పోటీ పెడితే ఎలా ఉంటుందన్న దానిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఐతే అక్కడ స్థానిక ప్రజా ప్రతినిధుల బలం విషయంలో తేడా వస్తే మొదటికే మోసం వస్తుందని భావించి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికలకు దూరంగా ఉండడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు బీజేపీ నేతలు.

స్థానిక సంస్థల MLC ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నా...భవిష్యత్‌లో TRS పార్టీకి వ్యతిరేకంగా పోరాడతామని, పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామంటున్నారు బీజేపీ నేతలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRSను ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story