Top

ఐటీఐఆర్‌ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ

తెలంగాణలో ఐటీఐఆర్‌ అమలు కాకపోవడానికి రాష్ట్ర సర్కారు వైఖరే కారణమంటూ విమర్శించారు.

ఐటీఐఆర్‌ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ
X

ఐటీఐఆర్‌ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ఐటీఐఆర్‌ అమలు కాకపోవడానికి రాష్ట్ర సర్కారు వైఖరే కారణమంటూ విమర్శించారు. ఐటీఐఆర్‌పై టీఆర్‌ఎస్‌ నేతలు రోజుకో ఉత్తరం రాస్తూ తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఐటీఐఆర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం... పాలనాపరమైన అడుగులు కూడా ముందు వేయని మాట వాస్తవం కాదా అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. రైల్వే, ఎంఎంటీఎస్‌, రేడియల్‌ రోడ్ల అభివృద్ధి చేసినట్లయితే.. ఐటీఐఆర్‌ ప్రాజెక్టును కొనసాగించడానికి కేంద్రం సిద్ధంగా ఉండేదన్నారు. రాష్ట్ర సర్కారు ఉద్దేశపూర్వకంగా సహాయ నిరాకరణ చేసి.. ప్రాజెక్టు అమలు ఆగిపోయేందుకు కారణం కాలేదా అని బండి సంజయ్‌ తన లేఖలో కేసీఆర్‌ను ప్రశ్నించారు.


Next Story

RELATED STORIES