Telangana Budget 2022-23 : ఈనెలాఖరున తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

Telangana Budget 2022-23 :  ఈనెలాఖరున తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
Telangana Budget 2022-23 : ఈనెలాఖరున తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ రేపు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

Telangana Budget 2022-23 : ఈనెలాఖరున తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ రేపు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. కరోనా నుంచి కోలుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న నేపథ్యంలో బడ్జెట్ లెక్కలు ఆసక్తిని రేపుతున్నాయి.. ఈసారి అంచనాలు భారీగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వ్యవసాయం, సంక్షేమం, అభివృద్ధి, పెరిగిన జీత భత్యాలతోపాటు దళితబంధు లాంటి మెగా స్కీమ్స్ అమలుకు భారీగా నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఏటా బడ్జెట్లో 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు దళిత బంధు కోసం కేటాయిస్తామని ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో గత బడ్జెట్ కంటే 15 శాతం అంటే దాదాపు రెండు లక్షల 45 వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉండబోతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

సాధారణంగా బడ్జెట్ పద్దులపై మూడు వారాల పాటు అంశాల వారీగా చర్చ జరగాల్సి ఉంటుంది. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించాలని ప్రభుత్వమే భావిస్తోంది. బడ్జెట్ ఆమోదంతో పాటు కీలక బిల్లులను కూడా ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు, గ్రాంట్లు, ప్రత్యేక సహాయం వంటి పూర్తి వివరాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ బడ్జెట్ రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈసారి బడ్జెట్ సమావేశాలు గరంగరంగా సాగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకు పడుతున్న టిఆర్ఎస్ నేతలు అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. గత ఎనిమిదేళ్లుగా కేంద్ర బడ్జెట్‌తో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని చెబుతున్న టీఆర్‌ఎస్‌ నేతలు అంశాల వారీగా ఏ మేరకు రాష్ట్రానికి నష్టం జరిగిందో లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేస్తారని టాక్‌. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఒక తీరుగా.. తెలంగాణకు మరో విధంగా కేంద్రం వివక్ష చూపుతోందని అసెంబ్లీ వేదికగా బీజేపీని నిలదీసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

అలాగే కేంద్రం తీసుకువచ్చిన రైతాంగ వ్యతిరేక విధానాలు, బొగ్గు గనుల వేలం, విభజన హామీలు నెరవేర్చడంలో గత ఎనిమిదేళ్లుగా కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని అసెంబ్లీ వేదికగా బయటపెట్టనున్నారు అధికార పార్టీ నేతలు.. సెస్ పేరుతో పనుల మీద పన్నులు వేస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను వేధిస్తున్న తీరును కూడా ఈ సెషన్‌లో ఎండగతామంటున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. రాష్ట్రాలకు సర్ ఛార్జ్, సెస్‌లను వేస్తూ ఆదాయం రాకుండా కేంద్రం మోసం చేస్తోందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న గులాబీ దళం.. అసెంబ్లీలోనూ నిలదీస్తామంటోంది. మొత్తంగా రాజకీయ హాట్‌ హాట్‌గా నడుస్తున్న ఈ టైమ్‌లో వస్తున్న బడ్జెట్‌ సెషన్‌ ఏ స్థాయిలో హీటు పుటిస్తుందోనని పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story