మరికాసేపట్లో తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం..!

మరికాసేపట్లో తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం..!
మరికాసేపట్లో తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ దివంగత శాసనసభ్యులకు సంతాప తీర్మానం ఉంటుంది. రేపు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది.

మరికాసేపట్లో తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ దివంగత శాసనసభ్యులకు సంతాప తీర్మానం ఉంటుంది. రేపు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మరుసటి రోజు అసెంబ్లీ సమావేశానికి సెలవు ప్రకటించారు. 20వ తేదీన బడ్జెట్‌పై చర్చ మొదలుపెడతారు. ప్రశ్నోత్తరాలను కూడా 20వ తేదీ నుంచే మొదలుపెట్టాలని బీఏసీ నిర్ణయించింది. చివరి రోజున ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలను ఈనెల 26వ తేదీ వరకు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.

మరోవైపు శాసనసభను మరికొన్ని రోజులు నడిపించాలని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క కోరారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టంపై చర్చించి, సభలో దానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని, రాయలసీమ ఎత్తిపోతల వల్ల కలిగే నష్టాలు, న్యాయవాద దంపతుల హత్య, గ్యాస్‌, డీజిల్‌, పెట్రోలు ధరల పెరుగుదలపై చర్చించాలని డిమాండ్ చేశారు. అయితే, కరోనా కారణంగానే పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నామని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ సమయం సరిపోకపోతే పనిగంటలు పెంచి, అర్ధరాత్రి అయినా సభను నిర్వహిస్తామన్నారు. సభలో సభ్యుల సంఖ్యకు అనుగుణంగా పార్టీలకు సమయం కేటాయిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు.

ఇక తెలంగాణ శాసన మండలి సమావేశాలు అయిదు రోజులు జరగనున్నాయి. మండలి బడ్జెట్‌ సమావేశాలు 17, 18, 20, 22, 26 తేదీల్లో నిర్వహిస్తామని కౌన్సిల్‌ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story