Telangana Budget Session: నాలుగు బొగ్గుగనుల వేలంపై అసెంబ్లీలో హాట్‌గా చర్చ..

Telangana Budget Session: నాలుగు బొగ్గుగనుల వేలంపై అసెంబ్లీలో హాట్‌గా చర్చ..
Telangana Budget Session: నాలుగు బొగ్గుగనుల వేలంపై అసెంబ్లీలో హాట్‌హాట్‌గా చర్చ జరిగింది.

Telangana Budget Session: నాలుగు బొగ్గుగనుల వేలంపై అసెంబ్లీలో హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. బొగ్గు గనుపై కేంద్రపై పోరాటం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. సీఎల్పీ లీడర్‌ భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ సభ్యులు శ్రీధర్‌ బాబు, రాజగోపాల్‌ రెడ్డి మండిపడ్డారు. సింగరేణి బొగ్గుగనుల వేలంపై తీర్మానం చేద్దామని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు.

నాలుగు బొగ్గుగనుల వేలంపై కేంద్రం కుట్ర చేస్తోందని, ప్రైవేటు వ్యక్తులకు దారాధత్తం చేస్తోందని బాల్కసుమన్‌, గండ్రవెంటరమణారెడ్డితో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ సభ్యులు మండిపడ్డారు. నాలుగు బొగ్గుగనుల ఎక్స్‌టెన్షన్‌ సింగరేణికి సంబంధించినవేనని, సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం ఉన్నందున ప్రవేటైజేషన్‌పై కేంద్రం నిర్ణయం తీసుకోజాలదన్నారు మంత్రి జగదీష్‌ రెడ్డి. కాంట్రాక్టుల కోసం కొందరు రాజకీయం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

ధరణి పోర్టల్‌పైనా కాంగ్రెస్‌ సభ్యులు, అధికార టీఆర్‌ఎస్‌ సభ్యుల మధ్య మాటల యుద్దం నడిచింది. ధరణి సర్వరోగ నివారిణి అన్నట్లుగా ప్రభుత్వం చిత్రీకరించిందని, సంత్సరంన్నర అవుతున్నా ధరణిలో ఎన్నో లోపాలు బయటపడుతున్నాయన్నారు. దీనికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి కౌంటర్‌ ఇస్తూ.. 2.48 కోట్ల ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను వెరిఫై చేసినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో మ‌ద్యం అమ్మకాల‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధ‌ర్ బాబు చేసిన వ్యాఖ్యల‌ను డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు గౌడ్ త‌ప్పుబ‌ట్టారు. గీత కార్మికుల సమస్యలపై శ్రీధర్‌బాబు ఏమైనా సూచనలు చేస్తారని ఆశించామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కౌంటరిచ్చారు. హ‌రిత‌హారంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 4 కోట్ల 6 వేల తాటి, ఈత మొక్కల‌ను నాటామ‌ని తెలిపారు.

ప్రశ్నోత్తరాల సమయంలో మన ఊరు-మనబడి కార్యక్రమంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానమిచ్చారు. సీఎం కేసీఆర్‌ తెచ్చిన ఈ విద్యాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యాశాఖలో 21వేల పోస్టులు మంజూరయ్యాయని.. త్వరలోనే భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ బడ్జెట్‌ నాలుగో రోజు సమావేశాలు ముగిశాయి. వివిధ పద్దులపై సభ్యులు విస్తృతంగా చర్చించారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలు సమస్యలను సభ్యులు లేవనెత్తారు.

Tags

Read MoreRead Less
Next Story