ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందించే అంశాన్ని పరిశీలిస్తాం : ముఖ్యమంత్రి కేసీఆర్

ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందించే అంశాన్ని పరిశీలిస్తాం : ముఖ్యమంత్రి కేసీఆర్
ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందించే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కరోనా కట్టడికి నిత్యం చర్యలు..

ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందించే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కరోనా కట్టడికి నిత్యం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బుధవారం అసెంబ్లీలో కరోనాపై చర్చలో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలన్నీ సభలో ప్రస్తావించడం సాధ్యం కాదని అన్నారు. కరోనా యోధులకు వేతనాలు పెంచి ఇస్తున్నామని సీఎం చెప్పారు. హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. బస్తీ దవాఖానాలతో ప్రజల చెంతకే వైద్యం అందిస్తున్నామని చెప్పారు. వచ్చే మూడు నెలల్లో హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానాలు సేవలందిస్తాయని తెలిపారు.

పీహెచ్‌సీలో కూడా ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని ఆదేశించామని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల దందా పెరిగిపోయిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రస్తావించారు. ప్రశ్నకు సమాధానంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కార్పొరేట్ ఆస్పత్రులపై నిఘా ఉండాల్సిందేనన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామని, ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ నివారించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఏ ఆస్పత్రి అయినా సరే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.సచివాలయంలో కూలిన ప్రాంతంలోనే గుడి, మసీదు కట్టిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story