కేసీఆర్ సరికొత్త నిర్ణయం.. మల్లన్నసాగర్‌కు..

కేసీఆర్ సరికొత్త నిర్ణయం.. మల్లన్నసాగర్‌కు..

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, పంప్‌ హౌజ్‌లకు దేవతామూర్తుల పేర్ల ఖరారు కొనసాగుతుంది. ఇప్పటికే ఐదు బ్యారేజ్‌లు, పంపుహౌజ్‌లకు పేర్లు నిర్ణయించిన సీఎం కేసీఆర్.. మరికొన్ని రిజర్వాయర్లకు నామకరణాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన అనంతగిరి రిజర్వాయర్‌, పంపహౌజ్‌లకు అన్నపూర్ణ అనే పేరు ఖరారు చేశారు. అలాగే రంగనాయక సాగర్, మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ సాగర్లకు కూడా అన్నపూర్ణ అనే పేర్లే కొనసాగనుంది.

సీఎం కేసీఆర్‌కు కొంచెం ఆధ్యాత్మిక భావన ఎక్కువ. అందుకే రిజర్వాయర్‌, పంపుహౌజ్‌లకు దేవతామూర్తుల పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మొదటి ఐదు నిర్మాణాలకు నామకరణం చేశారు. మేగిగడ్డ బారాజ్...కన్నెపల్లి పంపుహౌజ్‌కు లక్ష్మీగా పేరుపెట్టారు. అలాగే అన్నారం బ్యారేజ్‌, సిరిపురం పంప్‌హౌజ్‌కు సరస్వతిగా..సుందిళ్ల బారాజ్‌, గోలివాడ పంప్‌హౌజ్‌కి పార్వతిగా పేరు పెట్టారు. నందిమేడారం రిజర్వాయర్, పంపు హౌజ్‌కు నంది పేరు ఖరారు చేశారు. అలాగే లక్ష్మీపురం పంపుహౌజ్‌కు గాయత్రి నామకరణం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story