అజ్మీరా దర్గా ఉర్సు ఉత్సవాలకు చాదర్ పంపిన కేసీఆర్
అజ్మీరా దర్గా ఉర్సు ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చాదర్‌ను పంపించారు. దర్గాలో సమర్పించేందుకు ప్రత్యేకంగా తయారుచేయించిన చాదర్‌ను ముస్లీం మత పెద్దలకు కేసీఆర్ అందించారు.

X
Vamshi Krishna18 Feb 2021 12:30 PM GMT
అజ్మీరా దర్గా ఉర్సు ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చాదర్‌ను పంపించారు. దర్గాలో సమర్పించేందుకు ప్రత్యేకంగా తయారుచేయించిన చాదర్‌ను ముస్లీం మత పెద్దలకు కేసీఆర్ అందించారు. ఈ సందర్బంగా ముస్లీం మత పెద్దలు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం పురోగతి సాధించాలని ప్రార్ధించారు. అజ్మీర్ దర్గా ఉత్సవాల సందర్భంగా ముస్లీంలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీతోపాటు పలువురు మత పెద్దలు పాల్గొన్నారు.
అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో సమర్పించే చాదర్ (గిలాఫ్) ను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ సంప్రదాయబద్ధంగా సాగనంపారు. దర్గాలో సమర్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన చాదర్ ను ముస్లిం మత పెద్దలు సీఎం ముందు ప్రదర్శించారు. pic.twitter.com/fA5evR9hOs
— Telangana CMO (@TelanganaCMO) February 18, 2021
Next Story