నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రిలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు యాదాద్రికి చేరుకోనున్న కేసీఆర్.. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణ పనుల్ని పరిశీలించనున్నారు.

X
Vamshi Krishna28 Feb 2021 4:36 AM GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రిలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు యాదాద్రికి చేరుకోనున్న కేసీఆర్.. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణ పనుల్ని పరిశీలించనున్నారు. కొండపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రధాన ఆలయం వద్ద భక్తుల క్యూలైన్లు నూతనంగా నిర్మించారు. స్వామివారి ఊరేగింపు రథాల ఎత్తు పెంచారు. మాఢవీధుల్లో సుందరీకరణలో భాగంగా ఆకర్షణీయమైన మొక్కలు నాటారు. ఈ పనుల పురోగతిపై యాదాద్రి అభివృద్ధి అథారిటీ అధికారులతో కేసీఆర్ సమీక్షించనున్నారు.
Next Story