తెలంగాణా ఎంసెట్ ఫలితాలు వెల్లడి

తెలంగాణా ఎంసెట్ ఫలితాలు వెల్లడి
తెలంగాణా ఎంసెట్ ఫలితాలు వెలువడ్డాయి. అగ్రికల్చర్ ఫలితాల్లో 92.57 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు..

తెలంగాణా ఎంసెట్ ఫలితాలు వెలువడ్డాయి. అగ్రికల్చర్ ఫలితాల్లో 92.57 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ జెఎన్‌టీయూ ఆడిటోరియంలో టీఎస్ ఎంసెంట్ అగ్రికల్చరల్ , ఫార్మసీ ఫలితాలను పాపిరెడ్డి విడుదల చేశారు . మొత్తం 63 వేల 857 మంది పరీక్షలకు హాజరుకాగా 59 వేల 113 మంది ఉత్తీర్ణత సాధించారని ఆయన వెల్లడించారు. మొదటి మూడు ర్యాంకులు విద్యార్థినిలు కైవసం చేసుకున్నారని చెప్పారు. ఏపీకి చెందిన చైతన్య సింధు మొదటి ర్యాంక్ సాధించగా.. సంగారెడ్డికి చెందిన సాయిత్రిషా రెడ్డి రెండో ర్యాంక్, తుమ్మల స్నికిత మూడో ర్యాంక్ సాధింనట్లు ఆయన తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story