TS POLLS: రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ నామినేషన్లు

TS POLLS: రేవంత్‌రెడ్డి,  బండి సంజయ్‌ నామినేషన్లు
భారీ ర్యాలీలు నిర్వహించి నామినేషన్ల దాఖలు... కొనసాగుతున్న నామినేషన్ల పర్వం

తెలంగాణలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. బీ-ఫామ్ లభించిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కొడంగల్ ప్రజలు తనకు కట్టబెట్టే మెజార్టీ దేశానికే సందేశం ఇవ్వాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కర్ణాటకలో DK శివకుమార్ కు వచ్చిన ఓట్ల కంటే అధిక ఓట్లతో గెలిపించాలని కోరారు. భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తల కోలాహలంతో కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ నుంచి బయలుదేరే ముందు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో రేవంత్ ... వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం హెలికాఫ్టర్ లో కొడంగల్ చేరుకుని, నేరుగా గడీబాయి శివాలయానికి వెళ్లి పూజలు చేశారు. తర్వాత కొడంగల్ లోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి భారీ వాహన శ్రేణితో వెళ్లారు. కొడంగల్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ తనకు ఇచ్చిన పదవి కొడంగల్ ప్రజలందరిదని చెప్పారు. తర్వాత ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామ పత్రాలను సమర్పించారు.


కరీంనగర్ లో ర్యాలీగా వెళ్లి కరీంనగర్ భాజపా అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేశారు. ధర్మం కోసం పోరాడేది కేవలం భారతీయ జనతా పార్టీనే అని M.P. బండి సంజయ్ అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా పోరాడితే కేసీఆర్ తనపై 30 కేసులు పెట్టారని అన్నారు. క భాజపా కార్యకర్తలు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించి కమలం పార్టీకి పట్టం కట్టాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. తెలంగాణలో రాబోయేది భాజపా ప్రభుత్వమే అన్న ఆయన భారాస ప్రభుత్వం ప్రజల సొమ్మును దోచుకుందని మండిపడ్డారు. తనకు తెలంగాణ భాజపా అధ్యక్షుడి పదవి అప్పగించిన తర్వాత దుబ్బాక, GHMC, ఉపాధ్యాయ MLC ఎన్నికల్లో..... పార్టీని గెలిపించానని గుర్తుచేశారు. రాజాసింగ్ తాను ఎప్పుడూ కాషాయ జెండా వదిలిపెట్టలేదన్న సంజయ్ ........ ధర్మ రక్షణ కోసం పని చేస్తున్న తనపై మతతత్వవాది అనే ముద్ర వేసే ప్రయత్నం చేశారని అన్నారు.

హనుమకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో పూజల అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భారాస అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ భారాస అభ్యర్థిగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నామపత్రాలు రిటర్నింగ్ అధికారికి అందించారు. పెద్దమ్మతల్లి ఆలయంలో పూజల అనంతరం ప్రశాంతరెడ్డి నామినేషన్ వేశారు. బోధన్ భాజపా అభ్యర్థిగా మోహన్ రెడ్డి రెండుసెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. మంథని నుంచి భాజపా అభ్యర్థిగా చంద్రుపట్ల సునీల్ రెడ్డి భద్రాచలం భారాస అభ్యర్థిగా వెంకట్రావ్ నామినేషన్ వేశారు.

Tags

Read MoreRead Less
Next Story