రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్.. ఖాతాల్లోకి డబ్బులు

రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్.. ఖాతాల్లోకి డబ్బులు
Telangana: తెలంగాణలో 50 వేల లోపు రైతుల పంట రుణాలు ఇవాళ్టి నుంచి మాఫీ కానున్నాయి.

Telangana: తెలంగాణలో 50 వేల లోపు రైతుల పంట రుణాలు ఇవాళ్టి నుంచి మాఫీ కానున్నాయి. ఈ ప్రక్రియ నెలాఖరు వరకు కొనసాగనున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2018 డిసెంబర్‌ 11 నాటికి పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేస్తానని ప్రభుత్వం చెప్పింది. ఇందులో భాగంగా లక్ష రూపాయల రుణాన్ని నాలుగు విడుతలుగా ప్రభుత్వం మాఫీ చేస్తున్నది. గతేడాది 25 లోపు వారందరివి మాఫీ చేసిన ప్రభుత్వం, తాజాగా 50 వేల లోపు రుణాలు మాఫీ చేస్తున్నది.

రెండో విడుతలో భాగంగా ఇవాళ్టి నుంచి 50 వేల లోపు రుణాలు మాఫీ చేయనున్నారు. 6.6 లక్షల మందికి 2వేల కోట్లు మాఫీ చేస్తారు. సిద్దిపేట జిల్లాలో 27వేల 753 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. 94.56 కోట్ల రుణాలు మాఫీ చేస్తారు. మెదక్‌ జిల్లాలో 27వేల మందికి గాను 91.91 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 29వేల 64 మంది రైతులకు 98.10 కోట్ల రుణాలు మాఫీ కానున్నాయి. ఆ వెంటనే రైతులకు కొత్తగా వ్యవసాయ రుణాలు ఇవ్వనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story