మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం!
నల్గొండ జిల్లా అంగడిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాద మృతులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.

X
Vamshi Krishna22 Jan 2021 10:59 AM GMT
నల్గొండ జిల్లా అంగడిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాద మృతులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. మృతుల కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయంతో పాటు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని, బాధిత కుటుంబాల పిల్లలను గురుకులాల్లో చదివిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఇక గాయపడిన వారికి అన్నిరకాల సహాయక చర్యలు చేపడుతామన్నారు. దీనికి ముందు బాధిత కుటుంబాల ఆందోళనతో దేవరకొండ ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తాజాగా భాదిత కుటుంబాలను ఆదుకుంటామంటమని మంత్రి జగదీశ్ రెడ్డి హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు.
Next Story