పట్టణాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ప్రభుత్వం నూతన కార్యక్రమం

పట్టణాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ప్రభుత్వం నూతన కార్యక్రమం
పట్టణాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ప్రభుత్వం నూతన కార్యక్రమం

పట్టణాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో మొక్కల పెంపకం, పార్కుల అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు గ్రీన్‌ స్పేస్‌ ఇండెక్స్‌ పేరుతో కార్యక్రమాన్ని రూపొందించింది. మంత్రి కేటీఆర్‌ గ్రీన్‌ స్పేస్‌ ఇండెక్స్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. పట్టణాల్లో పాటించాల్సిన అంశాల వివరాలను ఆయా మున్సిపాలిటీలకు అందజేశారు.

పట్టణాల్లో గ్రీన్‌ కవర్‌, ఓపెన్‌ స్పేస్‌లపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంటుందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. పట్టణాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఇప్పటికే హరితహారం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పచ్చదనాన్ని ప్రోత్సహిస్తున్నామని గుర్తు చేశారు.. హరిత హారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. గ్రీన్‌ స్పేస్‌ ఇండెక్స్‌ ద్వారా పచ్చదనం పెంపొందించే అత్యుత్తమ పురపాలికకు ఏటా అవార్డులు అందిస్తామని కేటీఆర్‌ చెప్పారు. నాలుగేళ్ల పాటు గ్రీన్‌స్పేస్‌ ఇండెక్స్‌ కొనసాగుతుందని.. పురపాలికల మధ్య పోటీతత్వం కోసం దీన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. పార్కులు, మొక్కల పెంపకం, రహదారుల వెంబడి పచ్చదనం, ఇంటి వద్ద మొక్కల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలని కేటీఆర్‌ సూచించారు.

గ్రీన్ స్పేస్ ఇండెక్స్ ద్వారా పార్కుల అభివృద్ధి, మొక్కల పెంపకంలో వినూత్న డిజైన్లు, రోడ్ సైడ్ గ్రీనరీ పెంపకం, ఇంటి మొక్కల పెంపకం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కేటీఆర్‌ సూచించారు. ఇప్పటికే పట్టణవాసులకు కొత్త ప్రదేశాన్ని అందించడానికి జీహెచ్‌ఎంసీతోపాటు 141 పట్టణ స్థానిక సంస్థలలో ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన ట్రీ పార్కును అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇంకా, రాష్ట్రవ్యాప్తంగా 90 యుఎల్‌బీల పరిసరాల్లో పట్టణ అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story