ప్రధాని సైతం స్వయం ఆధారిత భారత్ పథకానికి నిధులు కేటాయించారు : తమిళసై

X
Nagesh Swarna23 Sep 2020 12:31 PM GMT
మహిళలు ఆర్థికంగా పురోభివృద్ది చెందితేనే కుటుంబం,రాష్ట్రం, దేశం అభివృద్ది చెందుతుందని గవర్నర్ తమిళసై సౌందరరాపజన్ అన్నారు. హైదరాబాద్ రాజ్ భవన్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన మహిళా వృత్తి విద్య శిక్షణ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ప్రధాని మోదీ సైతం మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు స్వయం ఆధారిత భారత్ పథకంలో భాగంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారన్నారు. మహిళలు కుట్లు ,అల్లికలు, టైలరింగ్ తో పాటు వ్యాపార రంగాల్లో రాణించాలని ఆమె ఆకాంక్షించారు.
Next Story