మత్స్యకారులకు మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వెహికల్స్..

మత్స్యకారులకు మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వెహికల్స్..
ఇప్పటివరకు చేపలను దిగుమతి చేసుకునే రాష్ట్రంగా ఉన్న తెలంగాణ... త్వరలోనే ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతుందని మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.

ఇప్పటివరకు చేపలను దిగుమతి చేసుకునే రాష్ట్రంగా ఉన్న తెలంగాణ... త్వరలోనే ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతుందని మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. నెక్లెస్ రోడ్ HMDA గ్రౌండ్స్ లో మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ వెహికల్స్ ప్రారంభించిన మంత్రులు ... 117మంది లబ్ధిదారులకు వాహనాలను అందించారు.

త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో చేపల మార్కెట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. హైద్రాబాద్ తో పాటు జిల్లాల్లో కూడా సంచార చేపల విక్రయ వాహనాలు తెస్తామన్నారు. మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ తో మత్స్యకారులకు ఆర్థిక పుష్టి, ప్రజలకు ఆరోగ్య పుష్టి కలుగుతుందని హరీష్‌ అన్నారు.

కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కొనియాడారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మత్య శాఖ కు 10కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ ఉండేదని.. ప్రస్తుతం 100 కోట్ల బడ్జెట్ ను కేటాయించామన్నారు.

రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క మత్స్య కారుడు ఖాళీ గా ఉండకుండా ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. మొబైల్ వెహికిల్స్ ద్వారా నాణ్యమైన చేపలను అందిస్తామని మహిళలకు కూడా ఈ వాహనాలను అందజేస్తున్నామని మంత్రి తలసాని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story