దేశంలోనే ధనిక రాష్ట్రం తెలంగాణ : సీఎం కేసీఆర్

దేశంలోనే ధనిక రాష్ట్రం తెలంగాణ : సీఎం కేసీఆర్
రాష్ట్రంలో కులం - మతంతో సంబంధం లేకుండా అన్నివర్గాలకు న్యాయం చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. మంచి చెడులు ప్రజలకు తెలుసన్నారు.

రాష్ట్రంలో కులం - మతంతో సంబంధం లేకుండా అన్నివర్గాలకు న్యాయం చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. మంచి చెడులు ప్రజలకు తెలుసన్నారు. విపక్షాల చిల్లర అరుపులను పట్టించుకోకుండా అభివృద్దికోసం ముందుకు సాగుతున్నామన్నారు. 24గంటల కరెంట్ విషయంలో జానారెడ్డితో అసెంబ్లీలో సవాల్ చేశామని అనుకున్నట్లే ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు.

తెలంగాణ సంపదను పెంచేందుకు ప్రణాళికలు, పథకాలు తెస్తున్నామని...తెలంగాణలో ఆకలిచావులు- ఆత్మహత్యలు లేకుండా చేశామన్నారు. హుజురాబాద్‌ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, బీజేపీ నేత పెద్దిరెడ్డికి గులాబి కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు పార్టీకండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం వివక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు సీఎంకేసీఆర్. తెలంగాణ ధనిక రాష్ట్రం అంటే కొంత మంది సన్నాసులకు అర్ధం కావడంలేదన్నారు. పల్లెలకు సంక్షేమ పథకాలు అందుతుంటే ప్రజలు సంతోష పడుతున్నారని , పాలమూరు- సీతారాం పూర్తి అయితే తెలంగాణ కాశ్మీరం అవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. కళ్యాణాలక్ష్మి- కేసీఆర్ కిట్ దేశంలో ఎక్కడా- ఏ రాష్ట్రంలో లేవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story