Top

కేటీఆర్ పుట్టిన రోజు స్పెషల్.. వంద మంది దివ్యాంగులకు..

పౌరులు, పాలకులు బొకేలు, కేకులు, హోర్డింగులు అంటూ డబ్బుని వృధా చేయవద్దని ఆయన సూచించారు.

కేటీఆర్ పుట్టిన రోజు స్పెషల్.. వంద మంది దివ్యాంగులకు..
X

ఈనెల 24న తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా పౌరులు, పాలకులు బొకేలు, కేకులు, హోర్డింగులు అంటూ డబ్బుని వృధా చేయవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గిప్ట్ ఏ స్మైల‌్‌లో భాగంగా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్ర వాహనాలను అందించనున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు.

గత ఏడాది తాను 6 అంబులెన్స్లను విరాళంగా ఇవ్వగా.. తెరాస ప్రజా ప్రతినిధులు, నేతలు 90 వాహనాలు ఇచ్చారని గుర్తు చేశారు. అవసరం ఉన్న వారికి వ్యక్తిగతంగా సాయం అందించాలని, వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటాలని తెరాస నేతలు, అనుచరులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

కేటీఆర్ పిలుపు మేరకు తాము కూడా దివ్యాంగులకు ఉచితంగా వాహనాల పంపిణీతో పాటు ఇతర సాయం అందిస్తామని మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సబిత ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎమ్మెల్యేలు సైది రెడ్డి, జీవన్ రెడ్డి, విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్ కుమార్ తదితరులు ప్రకటించారు.

Next Story

RELATED STORIES