తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణానికి టెండర్‌ ఖరారు

తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణానికి టెండర్‌ ఖరారు

తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్ ఖరారైంది. షాపూర్జీ పల్లోంజి సంస్థ ఈ టెండర్‌ను సొంతం చేసుకుంది. ఏడాదిలోపు సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని షాపూర్జీ పల్లోంజి సంస్థకు ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఈ టెండర్ కోసం షాపూర్జీ పల్లోంజితో పాటు ఎల్అండ్‌టీ సంస్థ తుది వరకు పోటీ పడ్డాయి. అయితే చివరకు షాపూర్జీ పల్లోంజి సంస్థ ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది.

టెండర్ కాంట్రాక్ట్ ప్రకారం 2 ఎకరాల్లోని ప్రాంతంలో 7 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయ భవన నిర్మాణం ఉండనుంది. మిగతా 25 ఎకరాల క్యాంపస్‌లో.. ల్యాండ్ స్కేపింగ్, పార్కింగ్, ఇతర సదుపాయాలు ఉంటాయి. భవనంలోని మధ్య పోర్షన్‌లో అశోకుడి ధర్మచక్ర స్థూపం ఉంటుంది. అది 15 అంతస్థుల ఎత్తు ఉంటుంది. ముఖ్యమంత్రి ఆఫీసు ఆరో అంతస్థులో ఉండనుంది. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story