Police : పోలీస్ కాదు.. హీరో పోలీస్..

Police : పోలీస్ కాదు.. హీరో పోలీస్..
Police : వరదల్లో చిక్కుకున్న రెండు నిండు ప్రాణాలను పోలీసులు కాపాడారు

Police : ఇద్దరు పోలీసులు నిజమైన హీరోలుగా నిలిస్తే.. మరో పోలీస్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఒక సంఘటన హైదరాబాద్‌లో జరిగితే.. మరో ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. రెండు వేర్వేరు సంఘటనలైనా.. ఆ ముగ్గురు పోలీసులు.. రెండు నిండు ప్రాణాలను కాపాడి శభాష్ పోలీస్ అనిపించుకున్నారు.

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామం వద్ద వాహనం ఢీకొని దంతన్‌పల్లికి చెందిన పారుక్ అనే వ్యక్తి ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో ఆదిలాబాద్ నుండి ఇంద్రవెల్లికి వెళ్తున్న ఇంద్రవెల్లి ఎస్సై సునీల్ అతడ్ని చూసాడు.

ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పారుక్ పరిస్థితిని చూసి వెంటనే నోటితో గాలి ఊదుతూ ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత హుటాహుటినా తన వాహనంలో గుడిహత్నూర్ ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాపాయం నుండి కాపాడారు.

ఇటు హైదరాబాద్‌ మంగళహాట్‌లో ఎస్సై రాంబాబు, హబీబ్‌నగర్ ఎస్సై సైదాబాబు మానవత్వాన్ని చాటుకున్నారు. పురాణాపూల్‌ వద్ద మూసీలో పడిన వ్యక్తిని ప్రాణాలకు తెగించి రక్షించారు. అనంతరం సదరు వ్యక్తిని ఎస్సైలు ఇద్దరూ ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం వైద్యులు అతడ్ని చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు హిమాయత్ సాగర్ జలాశయం వరదలో కొట్టుకుపోతున్న JBIT ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న అరవింద్ గౌడ్ అనే విద్యార్థిని రక్షించారు రికవరీ వ్యాన్ పోలీసుల బృందం.

అరవింద్ బైక్‌పై దర్గా కలీజ్ ఖాన్ నుండి శంషాబాద్ వైపు వెళ్లేందుకు హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్ వంతెనను దాటడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో వరద ప్రవాహం ఎక్కువ కావడంతో విద్యార్థి నీటిలో కొట్టుకుపోయారు. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పొలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బేగ్, డ్రైవరు మల్లాంగ్ షా, హెల్పెర్స్ రాకేశ్, విజయ్‌లు ప్రాణాలను తెగించి నీటిలో కొట్టుకుపోతున్న అరవింద్‌ను ప్రాణాలతో రక్షించారు.

ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను కాపాడిన ఇంద్రవెల్లి ఎస్సై సునీల్, మంగళహాట్, హబీబ్‌నగర్ ఎస్సైలు రాంబాబు, సైదాబాబులను సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్‌లు అభినందించారు. అనంతరం ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్‌రావు, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ లవకుమార్ రెడ్డి సమక్షంలో వారికి రివార్డులు అందజేశారు.

అలాగే అప్పగించిన విధుల పట్ల అత్యంత చిత్తశుద్ధితో పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ బేగ్, డ్రైవరు మల్లాంగ్ షా, హెల్పెర్స్ రాకేశ్, విజయ్‌లను కూడా స్టీఫెన్‌ రవీంద్ర అభినందిస్తూ రివార్డులు అందించారు.

Tags

Read MoreRead Less
Next Story