'పది' పబ్లిక్ పరీక్షల డేట్ వచ్చేసింది..

పది పబ్లిక్ పరీక్షల డేట్ వచ్చేసింది..
మొదటి మరియు రెండవ ఫార్మాటివ్ అసెస్‌మెంట్‌లు వరుసగా మార్చి 15 మరియు ఏప్రిల్ 15 నాటికి పూర్తవుతాయి.

కరోనా కలవరింతలతో ఏడాది కాలం గడిచిపోయింది. విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల సమయం కూడా ఆసన్నమైంది. స్కూలుకు వెళ్లకుండానే ఈ ఏడాది పరీక్షలు రాయాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, తెలంగాణలో ఎస్‌ఎస్సీ పరీక్షలు 2021 మే 17న ప్రారంభం కానున్నాయి. మొదటి మరియు రెండవ ఫార్మాటివ్ అసెస్‌మెంట్‌లు వరుసగా మార్చి 15 మరియు ఏప్రిల్ 15 నాటికి పూర్తవుతాయి. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఎస్‌ఎస్సీ పరీక్షలు మే 17 నుంచి మే 26 వరకు జరుగుతాయి.

ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు తెరవాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 9, 10 తరగతి విద్యార్థులు మాత్రమే తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇక వేసవి సెలవుల విషయానికి వస్తే మే 27 నుంచి జూన్ 13 వరకు ఉంటాయి.

పాఠశాల సమయం..

పాఠశాలలు ఉదయం 9:30 నుండి సాయింత్రం 4:45 వరకు తరగతులు నిర్వహించవలెను. అయితే జంటనగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్‌ పరిధిలోని పాఠశాలలు మాత్రం ఉదయం 8:45 నుండి సాయింత్రం 4:00 వరకు ఉంటుంది. ఇక డిజిటల్ తరగతులు ప్రతి రోజూ ఉదయం 10 నుండి 11 వరకు, సాయింత్రం 4 నుండి 5 వరకు అన్ని తరగతుల వారికి అందుబాటులో ఉంటాయి.

Tags

Read MoreRead Less
Next Story