టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టోలో థియేటర్ల యజమానులకు హామీలు

టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టోలో థియేటర్ల యజమానులకు హామీలు

కరోనా కారణంగా పది నెలలుగా తెలంగాణలో మూతపడిన సినిమా థియేటర్లు.. మంగళవారం తిరిగి ప్రారంభం కానున్నాయి. థియేటర్ల ప్రారంభానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 50 శాతం సీటింగ్‌ కెపాసిటీతో థియేటర్లు తెరుచుకోవచ్చని స్పష్టంచేసింది. సినిమా హాళ్లలో మాస్క్‌, శానిటైజర్‌ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. ఏసీ 24 నుంచి 30 డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఉండేలా చూడాలని సూచించింది. ప్రతి షోకు ముందు థియేటర్ల పరిసరాలు శానిటైజ్‌‌ చేయడం తప్పనిసరి అని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి రానున్నాయి.

అటు... గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్‌ సినిమా థియేటర్ల యజమానులకు పలు వెసులుబాట్లు కల్పించారు. టికెట్‌ ధర పెంచుకోవచ్చని, విద్యుత్‌ కనీస డిమాండ్‌ ఛార్జీలు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. 10 కోట్ల రూపాయల లోపు బడ్జెట్‌ గల సినిమాలకు రాష్ట్ర జీఎస్‌టీ రాయితీ ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అధిక షోలు ప్రదర్శించేందుకు అనుమతిస్తామని అన్నారు.


Tags

Read MoreRead Less
Next Story