Telangana : 300 ఎకరాల్లో జీనోమ్‌ వ్యాలీ రెండోదశ

Telangana : 300 ఎకరాల్లో జీనోమ్‌ వ్యాలీ రెండోదశ
5 లక్షల మందికి ఉద్యోగాలు

హైదరాబాద్‌లో జీనోమ్‌ వ్యాలీని విస్తరించి, మూడు ఫార్మా విలేజ్‌లు ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. H.I.C.C వేదికగా..... బయో ఆసియా సదస్సు ప్రారంభించిన సీఎం ఫార్మా రంగ అభివృద్ధికి కొత్త ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. త్వరలో లైఫ్‌ సైన్సెస్‌ నూతన విధానాన్ని ఆవిష్కరిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.

హైదరాబాద్‌ H.I.C.C వేదికగా 21వ బయో ఆసియా సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రారంభించారు. మూడురోజుల పాటు జరగనున్న జీవవైవిధ్య, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులపై చర్చించనున్నారు. ఫార్మారంగ రాజధానిగా ఉన్న హైదరాబాద్మ రిన్ని అవకాశాలను కల్పిస్తోందని రేవంత్ తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ, స్టార్టప్ కంపెనీలకు తమ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్న రేవంత్‌రెడ్డి MSMEలను పటిష్ఠం చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని స్పష్టంచేశారు. ఏడాదికి 5 కోట్ల వ్యాక్సిన్ల తయారీ సామర్ధ్యం గల ఉత్పత్తి కేంద్రాన్ని బయోలాజికల్ -E తో కలిసి జపాన్ సంస్థ తకేడా హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తోందని రేవంత్ ప్రకటించారు. ఆకాశమే మీ లక్ష్యమైతే.. మేం అక్కడికి తీసుకెళ్లడానికి రాకెట్ తో సిద్ధంగా ఉన్నామని ఫార్మా కంపెనీలకు రేవంత్‌ సూచించారు.

కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనలున్న పరిస్థితుల్లో హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న బయోఏషియా సదస్సు కీలకంగా మారిందని, బయోసైన్స్ రాజధానిగా హైదరాబాద్ నేడు యావత్ మానవాళికి ఒక భరోసాగా నిలిచిందని పేర్కొన్నారు. వైరస్ భయాలను ధీటుగా ఎదుర్కోగలమనే నమ్మకాన్ని హైదరాబాద్ కలిగించిందని, ఇప్పుడు ప్రపంచంలో వినియోగించే ప్రతి మూడు వ్యాక్సిన్లలో ఒకటి హైదరాబాద్ లోనే ఉత్పత్తి అవుతోందని గుర్తు చేశారు.

ఇటీవల దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ 40 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కొత్త ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని ఆయన వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లైఫ్‌సైన్సెస్‌కు కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నట్లు తెలిపారు. బయో ఆసియా సదస్సులో భాగంగా జీనోమ్ వ్యాలీ ఎక్సిలెన్స్ పురస్కారాన్ని ప్రఖ్యాత శాస్త్రవేత్త , నోబెల్ పురస్కార విజేత ప్రొఫెసర్ గ్రెగ్ సెమెన్జాకు ముఖ్యమంత్రి అందించారు

Tags

Read MoreRead Less
Next Story