Telangana: వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్‌లో TS ను TGకి మార్చుకోవాలా?

Telangana: వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్‌లో TS ను TGకి మార్చుకోవాలా?
క్లారిటీ ఇదిగో

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం మేరకు ఇక నుంచి తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్‌లో TS ను TGకి మార్చుకోవాలా? TG పేరిట రిజిస్ట్రేషన్ కాబోతున్నాయి. కొత్తగా రోడ్డెక్కే వాహనాలన్నింటికీ TG పేరిట రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు రవాణా శాఖ స్పష్టం చేసింది. మరి ఇప్పటికే ఉన్న వాహనాల పరిస్థితి ఏంటీ..? వాటిని అలాగే ఉంచుతారా ? లేక TSను తొలగించి TG గా మార్చుకోవాల్సిందేనా? ఆ వివరాలు తెలుసుకుందాం.

రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ఇకపై TG పేరిట చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. రవాణా శాఖకు ఇప్పటికే సర్కారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. గతేడాది నవంబర్ 30వ తేదీ నాటికి రవాణా శాఖలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలు 1,60,81,666 ఉన్నాయి. అయితే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో... తెలంగాణ రాష్ట్రాన్ని TGగానే సంబోధించే వాళ్లమని వివిధ మోటారు వాహనాల యూనియన్ నేతలు తెలిపారు. తమ వాహనాలకు TG అని రాసుకునే వాళ్లం అని అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న వివిధ క్యాబ్ అసోసియేషన్ నాయకులు, ఆటో యూనియన్ అసోసియేషన్ నాయకులు, టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ నాయకులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.

వాహనాలకు TS స్థానంలో TG పేరితో రిజిస్ట్రేషన్ చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మోటార్ వాహనాల యూనియన్ నేతలు తెలిపారు. కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యేటటువంటి వాహనాలకు TG పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తే ఇబ్బందేమి లేదని స్పష్టం చేస్తున్నారు. పాత వాహనాలకు కూడా TSను తొలగించి TG రిజిస్ట్రేషన్ చేస్తేనే ఆర్థికంగా భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా చేస్తే రవాణాశాఖ కార్యాలయాల్లో భారీగా క్యూలైన్లు ఉండే అవకాశం ఉంటుందని... అదొక సమస్యగా మారుతుందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పైగా ద్విచక్ర వాహనదారులకు, ఆటోవాలాలకు, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక భారం పడుతుందని మోటార్ వాహన యూనియన్ నేతలు వెల్లడించారు.

ఇప్పటికే AP పేరిట రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉన్నాయి. చాలా మంది ఉమ్మడి రాష్ట్రంలో కొనుగోలు చేసిన వాహనాలను ఏపీ పేరుతోనే తిప్పుతున్నారు. ఆ తర్వాత TS పేరిట రిజిస్ట్రేషన్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా రాష్ట్రప్రభుత్వ నిర్ణయంతో TG పేరిట రిజిస్ట్రేషన్ కానున్నాయి. రవాణాశాఖకు అధికారిక ఉత్తర్వులు జారీ అయితే... వారం రోజుల్లో TG పేరిట వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని రవాణా అధికారులు అభిప్రాయపడుతున్నారు. పాత వాహనాలు దాదాపుగా TS పేరు మీదనే కొనసాగుతాయని... ఈ విషయంలో మోటారు వాహన యూనియన్ నేతలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. కేవలం కొత్తగా రిజిస్ట్రేషన్ కాబోయే వాహనాలను మాత్రమే TG పేరిట రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు.


Tags

Read MoreRead Less
Next Story