BABU: పటేల్‌ నిజాం మెడలు వంచారు: అమిత్‌ షా

BABU: పటేల్‌ నిజాం మెడలు వంచారు: అమిత్‌ షా
నిజాంపై పోరాటం దేశభక్తికి నిదర్శనం... విముక్తి పోరాటంలో అమరులైన వారికి అమిత్‌ షా శ్రద్ధాంజలి

ఆపరేషన్ పోలో పేరుతో నిజాం మెడలు పటేల్ వంచారని.... వల్లభాయ్‌ పటేల్‌ లేకపోతే తెలంగాణకు ఇంత త్వరగా విముక్తి లభించేది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న అమిత్‌ షా సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి అమిత్‌ షా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం వార్ మెమోరియల్ , సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాగాన్నికి నివాళులర్పించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకారుల నాదస్వరం, మంగళ వాయిద్యం, బతుకమ్మ, బోనాలు, కోయ నృత్యాలను అమిత్ షా తిలకించారు. షోయబుల్లా ఖాన్, రామ్‌జీ గోండు పోస్టల్ కవర్లను కేంద్ర హోంమంత్రి విడుదల చేశారు. అనంతరం బహిరంగ సభలో భారత్ మాతా కీ జై అంటూ అమిత్‌ షా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రావి నారాయణ రెడ్డి, కాళోజీ నారాయణరావు, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నరసింహరావుకు శ్రద్ధాంజలి ప్రకటించారు.


హైదరాబాద్‌ విముక్తి కోసం నరసింహారావు, కాళోజీ, రావి నారాయణరెడ్డి వంటి మహనీయులు కృషిచేశారని అమిత్‌ షా అన్నారు. హైదరాబాద్ విమోచనం కోసం పోరాడిన అమరవీరులకు ప్రణామాలు చేసిన అమిత్‌షా...తెలంగాణ విమోచన దినోత్సవంపై దేశ ప్రజలందరికీ తెలియాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులకు... షా అంజలి ఘటించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ వల్ల హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగిందన్న అమిత్ షా... తెలంగాణ విముక్తి కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు.


స్వతంత్ర సమరయోధుల త్యాగాలను కాంగ్రెస్ సమాధి చేసే ప్రయత్నం చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. 13 నెలల ఆలస్యంగా తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందన్న కిషన్‌రెడ్డి... రజాకార్ల అరాచకాలను ప్రజలకు తెలియకుండా చేశారని మండిపడ్డారు. తెలంగాణ చరిత్రను గత పాలకులు తొక్కి పెట్టారన్న కిషన్ రెడ్డి... అమరవీరుల చరిత్రను మరుగున పడేసి మోసం చేశారని ఆరోపించారు.ఈరోజుకీ స్వాతంత్ర్య వేడుకలను జరిపేందుకు ఆపార్టీ సిద్ధంగా లేదని దుయ్యబట్టారు. విమోచనం కోసం మొదటిసారి గొంతెత్తిన పార్టీ బీజేపీనే అన్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ బాటలోనే బీఆర్‌ఎస్‌ కూడా కూడా విమోచన దినాన్ని విస్మరించిందని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story