Banjara Hills: బంజారా హిల్స్ భూ ఆక్రమణ కేసు.. క్లారిటీ ఇచ్చిన మాజీ ఎంపీ సోదరుడి కుమారుడు..

Banjara Hills: బంజారా హిల్స్ భూ ఆక్రమణ కేసు.. క్లారిటీ ఇచ్చిన మాజీ ఎంపీ సోదరుడి కుమారుడు..
Banjara Hills: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వంద కోట్ల స్థల వివాదంలో దర్యాప్తు జరుగుతోంది.

Banjara Hills: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వంద కోట్ల స్థల వివాదంలో దర్యాప్తు జరుగుతోంది. ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారంటూ తీవ్ర ఆరోపణలు రావడంతో టీజీ వెంకటేష్‌ సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్ ఓ వీడియో విడుదల చేశారు.. ఈ వివాదానికీ... ఎంపీ టీజీ వెంకటేష్ కీ ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు.

తాను పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.. ఈ స్థలానికి సంబంధించి పూర్తి హక్కుదారులు తామేనని కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ చూపించినా, స్థలం డాక్యుమెంట్లను చూపించినా పోలీసులు పట్టించుకోవడం లేదని వివరించారు. ఊరి నుంచి 70 మంది వరకు వచ్చారని ఈ కార్యక్రమం పూర్తి వీడియో ఫుటేజ్ కూడా ఉందని విశ్వప్రసాద్ తెలిపారు. వారి వద్ద ఎలాంటి మారణాయుధాలు లేవని చెప్పారు.

బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్ 10లో సర్వే నెంబర్ 403లో రెండున్నర ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ స్థలాన్ని ఏపీ జెమ్స్ అండ్ జువెల్లరీస్‌కు కేటాయించారు. ఆ స్థల నిర్వాహకులు ఒకటిన్నర స్థలంలో నిర్మాణాలను చేపట్టారు. మిగిలిన స్థలంలో పదిమంది సెక్యూరిటీని పెట్టారు. పాతబస్తీకి చెందిన వీవీఆర్ శర్మ అనే అతను డాక్యుమెంట్లను చూపించి ఈ స్థలం తమదే అని అనడంతో దీనిపై .. బంజారాహిల్స్‌ పోలీస్టేషన్లో.. కోర్టులో కేసులు నడుస్తున్నాయి.

దీంతో మాజీ ఎంపి టీజీ వెంకటేష్ సోదరుడి కుమారుడు విశ్వ ప్రసాద్ ఈ స్థలం విషయంపై ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి నుంచి అతను నిర్మాణాలు చేపడుతుండగా.. అక్కడి సెక్యూరిటీ అడ్డుకుంటున్నారు. ఆదివారం 70 మంది వరకు మనుషులు అక్కడకు రావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు.. అయితే, ఆ స్థలంలో ఈవెంట్‌ నిర్వహించుకుంటున్న నేపథ్యంలో వారంతా ఊరి నుంచి వచ్చారని విశ్వప్రసాద్‌ చెప్తున్నారు..

వాళ్ల దగ్గర ఎలాంటి మారణాయుధాలు లేవంటున్నారు. పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. అటు ఈ ల్యాండ్‌ వ్యవహారంలో టీజీ వెంకటేష్‌పై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కుమారుడు టీజీ భరత్‌ ఖండించారు.. మీడియాలోవస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.. ఎఫ్‌ఐఆర్‌లో తన తండ్రి టీజీ వెంకటేష్‌ పేరు లేకపోయినప్పటికీ కావాలనే కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తంగా సంచలనం సృష్టించిన ఈ ల్యాండ్‌ ఎపిసోడ్‌లో పోలీసులపైనే టీజీ విశ్వ ప్రసాద్‌ అనుమానాలు వ్యక్తం చేయడం.. కుట్ర జరుగుతుందోంటూ కామెంట్స్‌ చేసిన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న చర్చ నడుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story