తెలంగాణ

రెండు ATMలలో చోరీకి ట్రై .. చివరికి ఫోన్‌తో పరార్!

రెండు ATMలలో చోరీకి ట్రై .. చివరికి ఫోన్‌తో పరార్!
X

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలో ఓ దొంగ రెండు ATMలలో చోరీ చేయడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. మొదట హైదరాబాద్‌ రోడ్డులోని SBI ATMలో దొంగతనానికి ట్రై చేశాడు. ATM తెరిచే ప్రయత్నంగా చేస్తుండగా.. అటుగా పోలీసుల పెట్రోలింగ్ వాహనం రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత బస్టాండ్‌ వెళ్లి అక్కడి ఇండి క్యాష్‌ ATMను దోచుకునే ప్రయత్నం చేశాడు. అది కూడా కుదరకపోవడంతో.. బస్టాండ్‌లో నిద్రపోతున్నవారి నుంచి సెల్‌ఫోన్‌ దొంగతనం చేసి వెళ్లిపోయాడు. సీసీ కెమెరాలో రికార్డైన విజువల్స్‌ ఆధారంగా షాద్‌నగర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES