దుబ్బాక ఉపఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే!

దుబ్బాక ఉపఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే!
TRS ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఏర్పడ్డ ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. సాధారణంగా ఎమ్మెల్యే..

TRS ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఏర్పడ్డ ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. సాధారణంగా ఎమ్మెల్యే మృతి చెందితే ఆయన కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయం ఉంది. అయితే ఈసారి దుబ్బాక అసెంబ్లీ స్థానాన్ని ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల బరిలో దిగేందుకు నిర్ణయించాయి. దీంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ సీటు కాపాడుకునేందుకు అధికార టీఆర్ఎస్, ఉపఎన్నికలో గెలిచి ప్రభుత్వానికి సవాల్ విసరాలని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూడు ప్రధాన పార్టీలు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.

అయితే అభ్యర్థుల ఖరారు విషయంలో అన్ని పార్టీలు వ్యూహాత్మంగా ఆలస్యం పాటించాయి. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే వరకు వేచి చూడాలని కాంగ్రెస్, బీజేపీ భావించాయి. ముందుగా ఊహించినట్లే టీఆర్ఎస్ తన అభ్యర్థిగా దివంగత సోలిపేట రామాలింగారెడ్డి భార్య సుజాత పేరుని ఖరారు చేసింది.. రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారని... ఉద్యమం, పార్టీ కోసం అంకిత భావంతో పని చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి చివరి శ్వాస వరకు ఎంతో కష్టపడి పని చేశారని.... రామలింగారెడ్డి కుటుంబం యావత్తు అటు ఉద్యమంలోనూ ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ పాల్పంచుకుందని కొనియాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో ఆ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని చెప్పారు. రామలింగారెడ్డి తలపెట్టిన నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించడానికిప్రభుత్వ కార్యక్రమాలు యధావిధిగా అమలు కావడానికి రామలింగారెడ్డి కుటుంబ సభ్యులే ప్రాధినిద్యం వహించడం సమంజసం అని సీఎం అభిప్రాయపడ్డారు... జిల్లాలోని నాయకులందరితో సంప్రదింపులు జరిపాకే సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశామని తెలిపారు.

దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్ధి ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నర్సారెడ్డి పేరు దాదాపు ఖారారు చేసింది తెలంగాణ పీసీసీ. అయితే చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరుగినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి కాంగ్రెస్‌ ఆఫర్‌ ఇచ్చింది. టికెట్‌ ఇస్తాం... పోటీ చేయాలంటూ... శ్రీనివాస్‌రెడ్డితో మంతనాలు జరిపారు కాంగ్రెస్‌ నేతలు. టీఆర్ఎస్ అభ్యర్థిగా సుజాత పేరు ఖరారు కావడంతో...చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.గాంధీభవన్‌లో ఉమ్మడి మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి మాణికం సమావేశం నిర్వహించారు. దుబ్బాక ఉపఎన్నిక అభ్యర్థి ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చించారు.

ఇక బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు బరిలో దిగడం దాదాపు ఖరారైంది. ఇప్పటికే దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి 2014, 2018 ఎన్నికల బరిలో నిలిచిన రఘునందన్ రావు.. మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story