భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి భయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి భయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలను పులి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.. ఎక్కడ్నుంచయితే పులి తన ప్రయాణాన్ని ప్రారంభించిందో మళ్లీ అక్కడికే వచ్చిందన్న సంకేతాలు ప్రజల్లో భయాన్ని మరింతగా పెంచుతున్నాయి.. ఇప్పటికే గత నెలరోజుల వ్యవధిలో మూడు ఆవులపై దాడిచేసింది.. దీంతో ఎప్పుడొచ్చి మీద పడుతుందోనని జనం భయపడిపోతున్నారు.

భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం గుండ్లమడుగు ప్రాంతంలో గత రాత్రి పులి దాడి జరిగింది. అటవీ ప్రాంతం సమీపంలోని పంట పొలాల వద్ద ఆవుపై దాడిచేసింది. ఆవు అరుపులతో ఉలిక్కిపడ్డ గ్రామస్తులు పెద్ద పెద్దగా కేకలు వస్తూ అక్కడికి రాగా పులి పారిపోయినట్లుగా తెలుస్తోంది. టేకులపల్లి మండలానికి సరిహద్దులో ఉన్న లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి గ్రామం సమీపంలోనూ పులి వచ్చినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు.. రెండు మండలాల సరిహద్దులో పులి తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. గ్రామస్తుల సమాచారంతో అటవీ అధికారులు పులి కోసం గాలింపు మొదలు పెట్టారు. పులి పాద ముద్రలను గుర్తించడం ద్వారా అది ఎటు వెళ్లివుంటుందో అంచనా వేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story