తెలంగాణ

ఏం నాయనా తిన్నది అరగట్లేదా.. ఇలాంటి పిచ్చి పనులు..

చెట్టుకు ఉరి వేసుకునే టిక్ టాక్ వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అయింది.

ఏం నాయనా తిన్నది అరగట్లేదా.. ఇలాంటి పిచ్చి పనులు..
X

ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే బోరు కొడుతోందని ఇలాంటి పిచ్చి పనులు చేస్తారా. లాక్డౌన్ లో ఏం చేయాలో అర్థం కానట్లుంది. ఉబుసుపోక ఉరి వేసుకుందామనుకున్నారు. దానికి సంబంధించిన సరంజామా అంతా తీసుకు వచ్చి ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకునే టిక్ టాక్ వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అది కాస్తా వైరల్ అయింది. ఇంకే ముంది పోలీసులు కర్రపుచ్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం అప్పారెడ్డ గూడెం గ్రామానికి చెందిన జగన్, శ్రీను ఇద్దరు స్నేహితులు. ఇద్దరూ కలిసి ఉరి సీన్ ప్లాన్ చేసి టిక్ టాక్ వీడియో చేశారు.

అది వైరల్ కావడంతో జగన్ తల్లిదండ్రులకు విషయం తెలిసి కొడుకు నిర్వాకాన్ని పోలీసులకు చెప్పారు. వాళ్లైతే నాలుగు వాయిస్తారని. నందిగామ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరు యువకులను పిలిచి చీవాట్లు పెట్టారు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే బొక్కలో తోసి మక్కెలిరగ్గొడతామన్నారు. సరదాకు కూడా ఇలాంటి వీడియోలు చేయొద్దని చెప్పి హెచ్చరించి వదిలేశారు.

Next Story

RELATED STORIES