Top

కేసీఆర్ పిలుపు మేరకు కదిలొచ్చిన తెలుగు సినీ ఇండ‌స్ట్రీ

కేసీఆర్ పిలుపు మేరకు కదిలొచ్చిన తెలుగు సినీ ఇండ‌స్ట్రీ
X

హైదరాబాద్‌లో గ‌త కొద్ది రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌తో అనేక కాల‌నీలు జ‌ల‌దిగ్భంధంలో చిక్కుకున్నాయి. జనజీనవం అస్థవ్యస్తమైంది. వేలాదిమంది నగరవాసులు నిరాశ్రయులయ్యారు. దీంతో ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి తక్షణ సహాయం కింద 550కోట్లను కెటాయించారు. దీనికి తోడు బాధితులను ఆదుకునేందుకు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు సీఎం రిలీఫ్‌ ఫండ్ కు విరాళాలను ప్రకటించారు. తమ వంతు సహాయం చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ 15 కోట్ల ఆర్థికసాయం ప్రకటించారు.

ముఖ్యమంత్రి పిలుపు మేరకు తెలుగు సినీ ఇండ‌స్ట్రీ నుంచి చిరంజీవి కోటి రూపాయ‌ల ఆర్ధిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. అలాగే హీరో మ‌హేష్ బాబు రూ.కోటి రూపాయ‌లు, నాగార్జున రూ. 50 లక్షలు, ఎన్టీఆర్ రూ. 50 లక్షలు, విజ‌య్ దేవ‌ర‌కొండ రూ.10 లక్షలు ప్రకటించారు. హ‌రీష్ శంక‌ర్, అనీల్ రావిపూడి చెరో రూ. 5 లక్షల చొప్పున విరాళం అందించనున్నట్లు తెలిపారు.

గత వందేళ్లలో ఏనాడు లేనివిధంగా కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. అపార ప్రాణ, ఆస్థినష్టం జరిగింది. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రృతి వైపరిత్యంతో అల్లాడిపోతున్న వారికి నావంతు సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలు అందిస్తున్నానని చిరంజీవి అన్నారు. వీలైనంత మంది తమవంతు సహాయం అందించాలని ట్విట్టర్‌లో వెల్లడించారు.

గడిచిన వంద ఏళ్లలో ఏనాడు హైదరాబాద్‌లో ఇలాంటి పరిస్థితి ఏర్పడలేదు. భారీ వర్షం కారణంగా నగరం చిగురుటాకులా వణికిపోయింది. జన జీవనం భయాందోళకు గురైంది. ఒక రకంగా చెప్పాలంటే కోస్తా ప్రాంతంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలా తయారైంది. దీంతో వర్షం వస్తుందంటే చాలు నగరవాసులు భయంతో వణికిపోతున్నారు.

Next Story

RELATED STORIES