TPCC: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీ

TPCC: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీ
కాంగ్రెస్ మూడో జాబితా విడుదల... రెండు చోట్ల అభ్యర్థుల మార్పు

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నాలుగు నియోజకవర్గాలు మినహా అన్నింటికీ అభ్యర్థులను ప్రకటించింది.తొలిజాబితాలో 55, రెండోజాబితాలో 45, మూడో జాబితాలో 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారుచేసింది. మూడో జాబితా అభ్యర్థుల ఎంపికలో పార్టీ ఆచితూచి వ్యవహరించింది. చాలాచోట్ల గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు ఉండడం.. రాష్ట్రనేతల మధ్య సమన్వయం లేకపోవడం... కొత్తగా పార్టీలో చేరికలు ఉండడంతో మూడోజాబితా విడుదలలో జాప్యం జరిగింది. రెండో జాబితాలో 45 మందిని ప్రకటించగా అసంతృప్త జ్వాలలు చెలరేగాయి. సకాలంలో అణచి వేయలేకపోవడంతో... తీవ్ర అసంతృప్తికి గురైన నాయకులు కొందరు పార్టీని వదిలిపెట్టి బయటికి వెళ్లారు. మరికొందరు పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉంటూ నిరసన వ్యక్తంచేయటంతో క్షేత్రస్థాయిలో కొంత స్తబ్ధత నెలకొంది. మరోసారి నిర్వహించిన సర్వేలు కొన్నిసీట్లు కాంగ్రెస్‌కి తగ్గినట్లుగా వెల్లడించాయి. వాటని దృష్టిలో పెట్టుకొని... మూడో జాబితాను మరింత అప్రమత్తతో కేంద్ర ఎన్నికల కమిటీ పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది.


కాంగ్రెస్ మూడువిడతలుగా 114 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు స్థానాలకు కాంగ్రెస్ , ఒక స్థానంలో CPI అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కొడంగల్, కామారెడ్డి నుంచి బరిలో నిలిపింది. వనపర్తి, బోథ్‌ అభ్యర్థులని మార్చింది. మూడో జాబితాలో ప్రకటించిన 114 నియోజక వర్గాలు కాకుండా.... మరో ఐదు చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కొత్తగూడెం సీపీఐకి కేటాయించగా సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్,మిర్యాలగూడ నియోజకవర్గాలకుప్రకటించకుండా పెండింగ్‌లో ఉంచారు. CPMతో పొత్తుకొనసాగేటట్లు ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు పార్టీవర్గాలు వెల్లడిస్తున్నాయి.ఐతే ఇప్పటికే కాంగ్రెస్‌తో సీపీఎం తెగదెంపులు చేసుకొని... 14 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించింది. 20కి పైగా స్థానాల్లో అభ్యర్థులనునిలబెట్టాలని సీపీఎంను భావిస్తుండగా.. ఏదో విధంగా దగ్గరచేర్చుకొని ముందుకెళ్లాలని హస్తం పార్టీ భావిస్తోంది. సూర్యాపేటలో...... దామోదర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి మధ్య రాజీ కుదరకపోవడం రాష్ట్ర స్థాయి నేతల్లో ఏకాభిప్రాయం రాకపోవడంతో ఆగినట్లుగా తెలుస్తోంది.

కాంగ్రెస్ మూడో జాబితా

చెన్నూరు-వివేకానంద్‌

జుక్కల్- లక్ష్మీకాంతరావు

బాన్సువాడ- ఏనుగు రవీందర్‌రెడ్డి

కామారెడ్డి- రేవంత్‌రెడ్డి

నిజామాబాద్ అర్బన్ -మహమ్మద్ షబ్బీర్ అలీ

కరీంనగర్ -పురుమళ్ళ శ్రీనివాస్‌

సిరిసిల్ల- కేకే మహేందర్ రెడ్డి

నారాయణఖేడ్- సురేష్ కుమార్ షెట్కార్‌

పటాన్ చెరు - మధు ముదిరాజ్

డోర్నకల్ - డాక్టర్ రామచంద్రనాయక్

ఇల్లెందు- కోరం కనకయ్య

వైరా - మాలోతు రామ్ దాస్

సత్తుపల్లి- మట్టా రాఘమయీ

అశ్వారావుపేట- జారె ఆదినారాయణ

వనపర్తి- మెగారెడ్డి

బోథ్- గజేందర్‌

Tags

Read MoreRead Less
Next Story