కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసు ఇస్తారా?

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసు ఇస్తారా?

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్‌ లేదని, టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ చర్యలు తీసుకుంటుందా? ఆయనకు షోకాజ్‌ నోటీసలు ఇవ్వనుందా? ఇదే అంశంపై ఇప్పుడు కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. రాజగోపాల్‌రెడ్డి వాఖ్యలపై అటు కాంగ్రెస్‌ అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రనాయకత్వానికి సైతం ఆయనపై ఉదాసీనంగా ఉండాల్సిన అవసరం లేదంటూ హైకమాండ్‌ స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. అయితే.. దీనిపై ఆచీతూచీ అడుగులు వేయాలని నిర్ణయించారు టీ కాంగ్రెస్‌ నేతలు.

ఇవాళ జరిగే పార్టీ క్రమశికణా సంఘంలో.... రాజగోపాల్‌రెడ్డి అంశంపై చర్చకు రానుంది. దీనిపై సమగ్రంగా చర్చించిన తర్వాతే ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే.. రాజగోపాల్‌రెడ్డికి పార్టీ మారే స్వేచ్చను తామే ఇచ్చినట్లు అవుతుందని పార్టీ నేతలు ఆలోచనలో వడుతున్నారు. దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నదానిపై తర్జనభర్జన పడుతున్నారు.

అయితే రాజ్‌గోపాల్‌ వ్యూహాన్ని మాత్రం తిప్పికొడతామంటున్నారు హస్తం నేతలు. పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం కింద స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామంటున్నారు. అప్పడు స్పీకర్‌దే తుది నిర్ణయం అవుతుందని చెబుతున్నారు. అటు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ మాత్రం ఈ విషయంలో మౌనం పాటిస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డి అంశంపై స్పందించాల్సి అవసరం లేదంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story