ట్రైనీ ఎస్సైపై అత్యాచారయత్నం కేసు..ఎస్సై శ్రీనివాసరెడ్డికి..

ట్రైనీ ఎస్సైపై అత్యాచారయత్నం కేసు..ఎస్సై శ్రీనివాసరెడ్డికి..
Trainee SI Case: ట్రైనీ ఎస్సైపై అత్యాచారయత్నం కేసులో మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ ఎస్సై శ్రీనివాసరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు

ట్రైనీ ఎస్సైపై అత్యాచారయత్నం కేసులో మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ ఎస్సై శ్రీనివాసరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఆయనపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారయత్నం కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఎస్సైని మహబూబాబాద్ సబ్‌జైల్‌కి తరలించారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన అధికారే నీతి తప్పడంపై ఉన్నతాధికారులు కూడా సీరియస్‌ అయ్యారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, తప్పు చేస్తే ఎంతటివారికైనా శిక్ష తప్పదని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఐజీ నాగిరెడ్డి ఆదేశాలతో దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తున్నామన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ తర్వాత ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేశారు. దర్యాప్తు అధికారిగా తొర్రూరు డీఎస్పీకి బాధ్యతలు అప్పగించారు.

అటు, ట్రైనీ ఎస్సైపై అత్యాచారయత్నం చేసిన శ్రీనివాసరెడ్డి డ్యూటీ టైమ్‌లోనే మద్యం సేవించిన విషయం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ట్రైనీ ఎస్సైకి పలుమార్లు మెసేజ్‌లు చేసి వాటిని డిలీట్ చేస్తూ వేధింపులకు పాల్పడ్డాడు. కొద్ది రోజులుగా ఈ తరహానే టార్చర్ చేస్తున్నట్టు తెలిసింది. మొన్న ఉద్దేశపూర్వకంగానే బెల్లం ఊట స్థావరాలపై దాడుల పేరుతో పిలిచి అత్యాచారానికి ప్రయత్నించాడని బాధితురాలు చెప్తోంది. ఈ పెనుగులాటలో ఆమెకు పలుచోట్ల గాయాలయ్యాయి. ఆ ఫోటోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story