MLA Shankar Naik : కార్యకర్తలకు స్వయంగా మందుపోసిన ఎమ్మెల్యే..హోలీ వేడుకలు ఇలా

MLA Shankar Naik : కార్యకర్తలకు స్వయంగా మందుపోసిన ఎమ్మెల్యే..హోలీ వేడుకలు ఇలా
MLA Shankar Naik : హోలీ అంటే ఏముంటుంది... రంగులు, డాన్సులు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్ కూడా అదే అనుకున్నారో ఏమో?

MLA Shankar Naik : హోలీ అంటే ఏముంటుంది... రంగులు, డాన్సులు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్ కూడా అదే అనుకున్నారో ఏమో?. కార్యకర్తలతో మందు- చిందు కార్యక్రమం పెట్టేశారు. శంకర్‌ నాయక్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది. ఏది చేసినా సెన్సెషనే. హోలీ వేడుకల్లోనూ తన మార్క్ చూపించారు. బాటిల్ చేతబట్టి స్వయంగా ఆయనే కార్యకర్తలకు మందు పోశారు ఎమ్మెల్యే శంకర్‌ నాయక్.


మీరే చూడండి. ఎమ్మెల్యే ఎంత చక్కగా మందుపోస్తున్నారో. హోలీ వేడుకల సందర్భంగా 2రోజులు వైన్సు, బారులు బంద్ చేసింది ప్రభుత్వం. మరి మందు లేకపోతే మజా ఏం ఉంటుంది. అందుకే ఫుల్ స్టాక్ తెప్పించేశారు ఎమ్మెల్యే. బీరైతే బీరు, హార్డయితే హార్డు.... తాగినొళ్లకు తాగినంత. ఎమ్మెల్యేలకు తన కార్యకర్తలంటే ఎంత ప్రేమంటే..... మందులో నీళ్లు కలిపితే ఆరోగ్యం ఎక్కడ పాడవుతుందో అని.. ఏకంగా రానే పోసేస్తున్నారు.

కార్యకర్తలు కూడా ఎమ్మెల్యేతో డీజే స్టెప్పులేస్తూ కడుపునిండా తాగారు. ఎమ్మెల్యే మందు సెలబ్రేషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story