TS: కేసీఆర్‌ భవిష్యత్‌ తరాల కోసం ఆలోచిస్తారు

TS: కేసీఆర్‌ భవిష్యత్‌ తరాల కోసం ఆలోచిస్తారు
దేశంలో ఎక్కడా ఊరు ఊరికి నర్సరీలు లేవని.. ఒక్క తెలంగాణలోనే నర్సరీలు ఉన్నాయన్నారు హరీష్‌ రావు

కొందరు ఓట్ల కోసం రాజకీయం చేస్తారని... కాని సీఎం కేసీఆర్‌ మాత్రం భవిష్యత్‌ తరాల కోసమే ఆలోచిస్తున్నారన్నారు మంత్రి హరీష్‌. సంగారెడ్డిలో హరితహారంను పరిశీలించారు హరీష్‌. గురుకుల పాఠశాలలు, హరితహారం ఇందులో భాగమేన్నారు.270 కోట్ల మొక్కలు నాటడమే హరితహారం లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడా ఊరు ఊరికి నర్సరీలు లేవని.. ఒక్క తెలంగాణలోనే నర్సరీలు ఉన్నాయన్నారు. పర్యావరణాన్ని మెరుగుపర్చేందుకే హరితహారం చేపట్టామన్నారు. 7శాతం గ్రీన్‌ కవర్‌ పెరిగిందని కేంద్రమే చెప్పిందన్నారు. ఈ సందర్బంగా జిల్లా పంచాయితీ అధికారుల తీరుపై సీరియస్‌ అయ్యారు. హైవేపై మురికి నీరు ప్రవహించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story