TS : ఆశా వర్కర్లను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం : కేటీఆర్

TS : ఆశా వర్కర్లను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం : కేటీఆర్
కరోనా సంక్షోభం వల్ల వేతనాలు పెంచలేకపోయామని. ఆర్థిక పరిస్థితులు కుదుటపడగానే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.

ఆశా వర్కర్లకు అత్యధికంగా వేతనాలు ఇస్తోంది తెలంగాణ రాష్ట్రమేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు.. సిరిసిల్లలో పర్యటించిన ఆయన.. జిల్లెలలోని గవర్నమెంట్‌ హైస్కూల్‌లో సైన్స్‌ ల్యాబ్‌ను ప్రారంభించారు.. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.. అనంతరం పల్లె దవాఖానను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.. ఆశా వర్కర్ల బాబోగులు అడిగి తెలుసుకున్నారు.. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌ కంటే తెలంగాణలోనే ఎక్కువ వేతనాలు ఆశా వర్కర్లకు ఇస్తున్నట్లు చెప్పారు..

కరోనా సంక్షోభం వల్ల వేతనాలు పెంచలేకపోయామని.. ఆర్థిక పరిస్థితులు కుదుటపడగానే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.. రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోందన్నారు.. పల్లె దవాఖాన, బస్తీ దవాఖాన, హెల్త్‌ ప్రొఫైల్‌, ఉచిత డయాగ్నసిస్‌ సేవలు, కేసీఆర్‌ కిట్‌ వంటి కార్యక్రమాలు తెలంగాణ అమలవుతున్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story